- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Bangladesh : బంగ్లాదేశ్‌లో భారత్‌పై పాక్ ఐఎస్ఐ దుష్ప్రచారం
దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్‌ను రాజకీయ సంక్షోభం అలుముకోవడం వెనుక పాకిస్తాన్ హస్తం ఉందేమోనని పలువురు రాజకీయ పరిశీలకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులను ఆసరాగా చేసుకొని అక్కడి ప్రజలకు భారత్‌పై విద్వేషాన్ని కలిగించే తప్పుడు ప్రచారానికి పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ పాల్పడుతోందని అంటున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను ఐఎస్ఐ దుర్వినియోగం చేస్తోందని చెబుతున్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌లోని ఒక ఎయిర్‌పోర్టుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆ ఎయిర్‌పోర్టులో విధులు నిర్వర్తిస్తున్న భద్రతా సిబ్బంది ఇండియా సైనికులు అని సదరు వీడియోలో బంగ్లాదేశీయులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
దీన్ని D-Intent Data అనే ఫ్యాక్ట్ చెక్ టీమ్ తనిఖీ చేయగా.. ఆ ఎయిర్‌పోర్టులో ఉన్నది బంగ్లాదేశ్ ఎయిర్‌పోర్ట్ ఆర్మ్‌డ్ పోలీస్ బెటాలియన్ సిబ్బంది అని తేలింది. భారతీయ ఆర్మీ అక్కడ లేదని తేటతెల్లమైంది. ఈ తరహా తప్పుడు పోస్ట్‌లతో భారత్‌పై బంగ్లాదేశ్‌లో తప్పుడు ప్రచారానికి పాకిస్తాన్ ఐఎస్ఐ తెగబడుతోందని పరిశీలకులు అంటున్నారు. భారత్‌కు మిత్రదేశంగా ఉన్న బంగ్లాదేశ్‌ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాక్ కుట్ర పన్నిందని ఆరోపిస్తున్నారు.