- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత వాయుసేనతో యుద్ధం జరగొచ్చు: పాక్ రక్షణమంత్రి
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పూటకో మాట్లాడుతున్నారు. యద్దానికిసై అంటూ భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పూటకో మాట్లాడుతున్నారు. యద్దానికిసై అంటూ భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. మొన్న 36 గంటల్లో భారత్ తమ దేశంపై దాడి చేయవచ్చని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆయన మాట్లాడిన తరవాత మూడు రోజులు గడిచినా యుద్ధం జరగలేదు. ఇప్పుడు ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత వాయుసేనతో యుద్దం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.
ఓ మీడియా ఛానల్ ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ..ఇప్పటికే తమ గగన తలంలోకి వచ్చేందుకు ప్రయత్నతించిన రఫేల్ యుద్ద విమానాలను అడ్డుకున్నామని చెప్పారు. నిన్న మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత్ సింధూ జలాలను ఆపేందుకు బ్రిడ్జి కడితే దానిని కూల్చేస్తామంటూ వ్యాఖ్యానించాడు. నదిపై భారత్ నిర్మాణాలకు ప్రయత్నించడం దౌర్జన్యంగా భావిస్తున్నామని చెప్పారు. దౌర్జన్యం అంటే చాలా రూపాల్లో ఉంటుందని అన్నారు. నీటిని ఆపేస్తే పాక్ ఆకలి చావులను చూడాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. నీటిని ఆపడానికి కట్టిన బ్రిడ్జిలను కూల్చేస్తామని స్పష్టం చేశారు.






