- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bharat vs Pak : పాక్ రివేంజ్ నిర్ణయాలు.. దేనికైనా సిద్ధంగా ఉండాలని సైన్యానికి ఆదేశాలు
పహల్గాం ఉగ్రదాడి(Pahalagam Terror Attack) నేపథ్యంలో భారత్ పాక్ పట్ల పలు కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalagam Terror Attack) నేపథ్యంలో భారత్ పాక్ పట్ల పలు కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కాగా భారత్ నిర్ణయాలపై పాకిస్తాన్ కూడా పలు సంచలన నిర్ణయాలు(Pakistan Sensational Decisions) తీసుకుంది. తక్షణమే భారత పౌరులు పాక్ ను విడిచి వెళ్లాలని తేల్చి చెప్పింది. భారత విమానాలు ఎగిరే పాక్ గగనతలాన్ని కూడా మూసివేసింది. అట్టారి-వాఘా బార్డర్ ను మూసివేసింది(Attari-Vagha Boarder Closed). భారతీయులకు జారీ చేసే సార్క్ వీసాలను రద్దు చేసింది. ఇకపై భారత్ తో అన్ని వ్యాపార సంబంధాలు, దౌత్య సంబంధాలు తెగ తెంపులు చేసుకుంటున్నామని స్పష్టం చేసింది.
సింధు జలాలను ఆపివేయడం యుద్ధానికి సై అన్నట్టేనని పేర్కొంది. సింధు జలాల్లో ప్రతి చుక్కా తమదేనని తెలిపింది. భారత సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని తెలిపింది. అదే విధంగా దేనికైనా సిద్ధంగా ఉండాలని పాక్ సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్టు కీలక సమాచారం. మరోవైపు.. భారత్ తీసుకున్న నిర్ణయాలతో పాక్ స్టాక్ మార్కెట్లు గురువారం కుదేలయ్యాయి. పాక్ స్టాక్ మార్కెట్లు ఏకంగా 2 శాతం పతనం కాగా, స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్‌సైట్ మూసివేశారు.






