- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pakistanis : భారత్‌ను వీడుతున్న పాక్ పౌరులు.. రెండు రోజుల్లో ఎంత మంది వెళ్లారంటే ?
పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ పౌరులు దేశాన్ని వీడాలని భారత్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ పౌరులు దేశాన్ని వీడాలని భారత్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో పాకిస్థానీయులు (Pakisthanis) దేశాన్ని వీడుతున్నారు. రెండు రోజుల్లో 272 మంది పాక్ సిటిజన్స్ అట్టారి-వాఘా సరిహద్దు (Attari vagha barder) ద్వారా వెళ్లిపోయినట్టు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 25న 191 మంది, 26న మరో 81 మంది బయలుదేరారు. అయితే ఆదివారం చివరి రోజు సైతం భారీగా భారత్ ను వీడారని సమాచారం. కానీ దీనికి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అదే టైంలో 13 మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 629 మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి పంజాబ్‌లో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు క్రాసింగ్ దాటి తిరిగి వచ్చారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల తర్వాత పోలీసులు కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిన వ్యక్తులను వీలైనంత త్వరగా వెనక్కి పంపించడం ప్రారంభించారు. పాకిస్తానీ పౌరులు గడువు లోగా దేశం వీడకపోతే కఠిన చర్యలు తీసుకునే చాన్స్ ఉంది. ఈ నెల 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహెల్గాంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మంది పర్యాటకులను చంపారు. దీనిని సీరియస్ గా పరిగణించిన భారత్ చర్యలు చేపట్టింది. సాక్క్ వీసాలు ఉన్నవారు ఏప్రిల్ 27వ తేదీలోగా పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అలాగే మెడికల్ వీసాలు ఉన్నవారికి ఏప్రిల్ 29గా గడువు విధించింది. అయితే, దీర్ఘకాలిక, దౌత్య, అధికారిక వీసాలు ఉన్నవారికి మినహాయింపు ఇచ్చింది. బార్డర్ ద్వారా మాత్రమే గాక మరికొంత మంది విమానాశ్రయాల నుంచి కూడా వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.






