నా భ‌ర్త హిందూ..35ఏళ్ల క్రితం భార‌త్ వ‌చ్చా..పాక్ మ‌హిళ ఆవేద‌న‌

by Ajay Maddhiboyina |

ప‌హ‌ల్గామ్ దాడి త‌ర‌వాత భార‌త ప్ర‌భుత్వం పాకిస్థాన్ పౌరుల వీసాలు ర‌ద్దు చేసి వెంట‌నే సొంత దేశానికి వెళ్లాల‌ని ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.

నా భ‌ర్త హిందూ..35ఏళ్ల క్రితం భార‌త్ వ‌చ్చా..పాక్ మ‌హిళ ఆవేద‌న‌
X

దిశ, వెబ్ డెస్క్: ప‌హ‌ల్గామ్ దాడి త‌ర‌వాత భార‌త ప్ర‌భుత్వం పాకిస్థాన్ పౌరుల వీసాలు ర‌ద్దు చేసి వెంట‌నే సొంత దేశానికి వెళ్లాల‌ని ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. అయితే భార‌తీయులను వివాహం చేసుకున్న కొంత‌మంది పాకిస్థాన్ పౌరులు ఈ నిర్ణ‌యంతో ఇబ్బంది ప‌డుతున్నారు. ఇక 35 క్రితం భార‌త్‌కు చెందిన హిందూ వ్యక్తిని వివాహం చేసుకున్న ఓ పాక్ మహిళలకు కూడా అలాంటి సమస్యే వచ్చింది. శారదా బాయి అనే పాకిస్థానీ మహిళ ఇండియాకు చెందిన మహేశ్ కుక్రేజ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లి తరవాత భర్తతో కలిసి భారత్‌లోనే ఉంటోంది.

దాదాపు 35 ఏళ్లుగా ఆ మహిళ భర్తతో కలిసి ఒరిస్సాలో ఉండగా వీరికి సంతానం కలగడంతో పాటూ మనవల్లు, మనవరాళ్లు కూడా ఉన్నారు. శారదాబాయికి ఇక్కడే ఓటర్ ఐడీ కూడా ఉంది కానీ పౌరసత్వం లేదు అనే కారణంగా పోలీసులు ఆమెను తిరిగి పాకిస్థాన్ వెళ్లిపోవాలని అంటున్నారట. దీంతో శారదా బాయి తనకు పాకిస్థాన్‌లో ఎవరూ లేరని కుటుంబం అంతా ఇండియాలోనే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఆమె వీసా క్యాన్సిల్ అయ్యిందని పాక్ వెళ్లిపోవాలని చెబుతున్నారు. శారదాబాయి దిక్కుతోచని స్థితిలో భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తాను ఇండియన్‌గానే ఉంటానని చెబుతున్నారు. తన బాధను ప్రభుత్వం అర్థం చేసుకుని ఇక్కడే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.

Next Story