ఉత్తరప్రదేశ్‌లో మరో పాకిస్తానీ గూఢచారి అరెస్ట్

by velandi.Saikiran |

పాకిస్తాన్ వర్సెస్ ఇండియా యుద్ధం ముగిసిన నేపథ్యంలో.. పహాల్గం సంఘటనపై దృష్టి పెట్టింది మోడీ ప్రభుత్వం. ఆ సంఘటన

ఉత్తరప్రదేశ్‌లో మరో పాకిస్తానీ గూఢచారి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ వర్సెస్ ఇండియా యుద్ధం ముగిసిన నేపథ్యంలో.. పహాల్గం సంఘటనపై దృష్టి పెట్టింది మోడీ ప్రభుత్వం. ఆ సంఘటన జరగడానికి గల కారణాలను... వెతుకుతోంది. ఈ నేపథ్యంలోనే చాలామంది అరెస్టు కూడా అవుతున్నారు. ఇండియాలో ఉంటూ... పాకిస్తాన్ కు సమాచారాన్ని అందిస్తున్నారు కొంత మంది. తాజాగా హర్యానాలో జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ అరెస్టయిన సంగతి తెలిసిందే.

పహల్గాం సంఘటన జరగడానికి ఈమె కూడా కారణమని తెలుస్తోంది. అయితే విచారణ చేపట్టిన ఇండియన్ అధికారులు వెంటనే ఆమెను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో మరో పాకిస్తానీ గూఢచారిని అరెస్టు చేశారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ లో షహజాద్ అనే ముస్లిం వ్యక్తిని.. అధికారులు తాజాగా అరెస్టు చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్ లో ఉంటూ... పాకిస్తాన్ కు కీలక సమాచారాన్ని అందిస్తున్నట్లు గుర్తించి.. అతన్ని అరెస్టు చేశారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story