- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాబ్రీ మసీదుకు పునాది మా సైన్యమే వేస్తుంది.. పాక్ సెనెటర్ సంచలన వ్యాఖ్యలు!
పహల్గామ్ ఉగ్రదాడితో ఇండియా పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడితో ఇండియా పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ సైన్యంలో 5వేల మంది సైనికులు భయంతో రిటైర్మెంట్ తీసుకున్నారని వార్తలు వస్తుంటే రాజకీయనాయకులు మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మంగళవారం పాకిస్థాన్ ఎగువసభలో ఆ దేశ సెనెటర్ పాల్వాషా మొహమ్మద్ జై ఖాన్(Palwasha Mohammad Zai Khan) సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయోధ్యలో కొత్త బాబ్రీ మసీదు (Babri masiq) నిర్మించడానికి పాకిస్థాన్ సైనికులే పునాధి వేస్తారని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దానికి మొదటి ఇటుకను ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్(asim munir) స్వయంగా ఇస్తారని, మేమేం గాజులు తొడుక్కుని కూర్చోలేదని అన్నారు. అంతే కాకుండా పాక్ భారత్ మధ్య యుద్ధం జరిగితే సిక్కు సైనికులు పాకిస్థాన్ పై దాడి చేయరు అని నొక్కి చెప్పారు. ఎందుకంటే పాకిస్థాన్ వారికి గురునానక్‌కు సంబంధించిన భూమి అని తెలిపారు. పాల్వాషా మొహమ్మద్ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆమె భారత్‌లో మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు మండిపడుతున్నారు. బాబ్రీ మసీదు అంశంపై ఇప్పుడు మాట్లాడటం, సిక్కులను ఓన్ చేసుకోవడమే అందుకు నిదర్శనం అని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే పాక్ రాజకీయనాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. పహల్గామ్ ఘటన తరవాత భారత్ చర్యలు ప్రారంభించినప్పటి నుండి తరచూ ఎవరో ఒకరు ఇలాంటి కామెంట్లు చేస్తూనే ఉన్నారు. కానీ భారత్ మాత్రం పాక్ ఉగ్రవాదులను అంతం చేసి తీరుతామని ప్రకటన చేసి ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చింది. దీంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందా అన్నది ఉత్కంఠగా మారింది.






