- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియాపై పాకిస్తాన్ ప్రధాని మరో కుట్ర?
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య వాతావరణం మొన్నటి వరకు కొనసాగగా ఇప్పుడు చల్లారింది. అయితే ఇలాంటి నేపథ్యంలో

దిశ, వెబ్ డెస్క్ : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య వాతావరణం మొన్నటి వరకు కొనసాగగా ఇప్పుడు చల్లారింది. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఇండియన్ ఉద్దేశించి గెలికే ప్రయత్నం చేసాడు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ( Pakistan PM Shehbaz Sharif ). పహల్గాం సంఘటన దురదృష్టమంటూనే... విషం కక్కే ప్రయత్నం చేశాడు.
1971 సంవత్సరం యుద్ధం నాటి ఓటమికి తాము ప్రతీకారం తీర్చుకున్నామంటూ... హాట్ కామెంట్స్ చేశాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం.. ఆగకపోతే తీవ్ర పరిణామాలు ఉండేవని.. అభిప్రాయపడ్డారు.
భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో ( Operation Sindoor) మరణించిన కుటుంబాలను పరామర్శించి.. వాళ్లకు ఆర్థిక సహాయం కూడా చేశారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. పహాల్గం సంఘటనపై ( Pahalagam) అంతర్జాతీయ స్థాయి దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇది ఇలా ఉండగా పహాల్గాం సంఘటన నేపథ్యంలో.. పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో మొత్తం 28 మంది పర్యాటకులు... మృతి చెందారు.






