యుద్ధ విమానాల కూల్చివేత వ్యాఖ్యలపై స్పందించిన పాకిస్థాన్ మంత్రి

by Yella Dhawani Reddy |

భారత్ చేసిన దాడిలో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం అయినప్పటికీ.. పాకిస్థాన్‌కు చెందిన ఒక్క సైనిక విమానం కూడా ధ్వంసం కాలేదన్నారు. పైగా పాకిస్థాన్‌నే ఆరు భారత విమానాలను, డ్రోన్లను ధ్వంసం చేశాయన్నారు.

యుద్ధ విమానాల కూల్చివేత వ్యాఖ్యలపై స్పందించిన పాకిస్థాన్ మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను ((Pakistan Fighter Jets)) భారత ఆర్మీ నేలకూల్చిందని శనివారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ (Amar preeth singh) వెల్లడించారు. మన గగనతల రక్షణ వ్యవస్థ, ఎస్‌-400 క్షిపణి వ్యవస్థలు సమర్థంగా పనిచేశాయని అన్నారు. సుమారు 300 కిలోమీటర్ల దూరం నుంచి ఒక నిఘా విమానాన్ని ధ్వంసం చేశామని, ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాన్ని చేధించడంలో ఇదే రికార్డు అని ఆయన చెప్పారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. ఐఏఎఫ్ చీఫ్ వ్యాఖ్యలలో వాస్తవం లేదని, తీవ్రంగా ఖండించారు. భారత్ చేసిన దాడిలో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం అయినప్పటికీ.. పాకిస్థాన్‌కు చెందిన ఒక్క సైనిక విమానం కూడా ధ్వంసం కాలేదన్నారు. పైగా పాకిస్థాన్‌నే ఆరు భారత విమానాలను, డ్రోన్లను ధ్వంసం చేశాయన్నారు.

Next Story