బీహార్ సీఎంకు పాక్ గ్యాంగ్ స్టర్ బెదిరింపులు

by Muthe.Rajitha |

బీహార్ సీఎం నితీష్ కుమార్ ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.

బీహార్ సీఎంకు పాక్ గ్యాంగ్ స్టర్ బెదిరింపులు
X

దిశ, వెబ్ డెస్క్ : బీహార్ సీఎం నితీష్ కుమార్ ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. పాకిస్తాన్ కు చెందిన గ్యాంగ్ స్టర్ షహ్జాద్ భట్టి నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్టు సమాచారం. ఇటీవల ఆ కార్యక్రమంలో నితీష్ కుమార్ ఓ ముస్లిం మహిళ హిజాబ్ లాగడం పట్ల నితీష్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని భట్టి డిమాండ్ చేసాడు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఒక మహిళతో ప్రవర్తించే విధానం అదేనా అంటూ మండిపడ్డాడు. అయితే పాక్ గ్యాంగ్ స్టర్ బెదిరింపులపై దర్యాప్తు చేస్తున్నామని బీహార్ డీజీపీ వినయ్ కుమార్ పేర్కొన్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు.

Next Story