- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సరిహద్దుల్లో మరోసారి పాక్ డ్రోన్ల కలకలం
by Muthe.Rajitha |
భారత్ - పాక్ సరిహద్దుల్లో మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది పాకిస్తాన్.

X
దిశ, వెబ్ డెస్క్ : భారత్ - పాక్ సరిహద్దుల్లో మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది పాకిస్తాన్. నేడు సరిహద్దు ప్రాంతాల్లో మళ్ళీ పాక్ డ్రోన్ల సంచారం కలకలం రేపింది. శనివారం జమ్ముకాశ్మీర్లోని సాంబా సెక్టార్లో డ్రోన్ ద్వారా పాక్ వెపన్స్ జారవిడువగా.. నేడు మరోసారి పాక్ డ్రోన్లు జమ్ముకాశ్మీర్లోని నౌషేరా సెక్టార్లోని LOC వెంబడి చక్కర్లు కొట్టాయి. కాగా ఈ డ్రోన్ పై భారత ఆర్మీ ఫైరింగ్ జరిపారని.. మరికొంతసేపటికి మరిన్ని డ్రోన్స్ కనిపించినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పాక్ డ్రోన్లు ఆయుధాలు లేదా డ్రగ్స్ జారవిడిచి ఉండవచ్చనే అనుమానంతో భద్రతా బలగాలు విస్తృత తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. ఇక నిన్న దొరికిన ఆయుధాలు ఎవరి కోసం పంపారు? దీని వెనుక ఉన్న ఉగ్రవాద నెట్‌వర్క్ ఏమిటి? అనే విషయాలపై నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి.
Next Story






