ఫిరోజ్‌పూర్ లో ఓ ఇంటిపై కూలిన పాక్ డ్రోన్.. ముగ్గురికి తీవ్ర గాయాలు

by Ramesh Goud |

భారత్ -పాక్ దేశాల నడుమ నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్థాన్ డ్రోన్ దాడులకు తెగబడుతుంది.

ఫిరోజ్‌పూర్ లో ఓ ఇంటిపై కూలిన పాక్ డ్రోన్.. ముగ్గురికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ -పాక్ దేశాల నడుమ నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్థాన్ డ్రోన్ దాడులకు తెగబడుతుంది. దీంతో భారత్ సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir), రాజస్థాన్ (Rajastan), గుజరాత్ (Gujarath), పంజాబ్ (Panjab) రాష్ట్రాల్లో హై అలర్ట్ (High Alert) ప్రకటించారు. అంతేగాక పాక్ డ్రోన్ దాడులు చేస్తున్న ప్రాంతాల్లో విద్యుత్ ను నిలిపివేయడమే గాక బ్లాక్ అవుట్ (Block out) ను కూడా ప్రకటించారు. జమ్ము కశ్మీర్, సాంబా సెక్టార్, ఫిరోజ్ పూర్ ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులకు యత్నిస్తోంది.

పాక్ డ్రోన్లను భారత బలగాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఫిరోజ్‌పూర్ లో జనావాసాలపై పాకిస్థాన్ డ్రోన్ దాడులు చేస్తోంది. ఈ దాడిలో పాకిస్థాన్ డ్రోన్ ఫిరోజ్‌పూర్ (Firozpur) లోని ఓ ఇంటిపై పడింది. దీంతో ఆ ఇంటిలోని ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దీనిపై డాక్టర్ కమల్ బాగి మాట్లాడుతూ.. డ్రోన్ బాంబు కారణంగా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని తెలిపారు. వీరిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉందని, ఆమెకు తీవ్ర కాలిన గాయాలు అయ్యాయని చెప్పారు. అలాగే మిగతా ఇద్దరికి స్వల్పంగా కాలిన గాయాలు అయ్యాయని, వారికి వెంటనే చికిత్స ప్రారంభించామని వెల్లడించారు.

Next Story