- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్తాన్ డాక్టర్.. అదుపులోకి తీసుకున్న BSF సిబ్బంది
భారత్(India), పాకిస్తాన్(Pakistan) దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India), పాకిస్తాన్(Pakistan) దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ హుస్సేన్(Pakistani Doctor) అనే ఓ డాక్టర్ భారత్‌లోకి ప్రవేశించాడు. పంజాబ్(Punjab)లోని గురుదాస్‌పూర్(Gurdaspur)లో ప్రత్యక్షమయ్యాడు. అతడు అనుమానాస్పందంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బీఎస్ఎఫ్ సిబ్బంది అక్కడకు చేరుకొని మహ్మద్ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాం బైసరన్ లోయలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది అమాయక ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి తాము బాధ్యులమని పాక్ కేంద్రంగా ఉన్న లష్కరే తోయిబాకు చెందిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ బాధ్యత ప్రకటించుకుంది. దీన్ని భారత ప్రభుత్వం గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఇక ఈ ఘటన తర్వాత భారత్, పాక్ ఒకరిపై ఒకరు ఆంక్షలు విధించుకున్నారు. భారత్‌లో ఉన్న పాకిస్తానీలు, పాకిస్తాన్‌లో ఉన్న భారతీయులు వెంటనే తమ దేశాన్ని వదిలివెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉన్న పాక్‌కు చెందిన ఎక్కడ కనిపించినా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.






