- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mob Licking : 'పాకిస్తాన్ జిందాబాద్' అని నినాదాలు.. చివరికి అతని గతి ఏమైందంటే?
జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack)లో 28 మంది టూరిస్టులను ఉగ్రవాదులు పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack)లో 28 మంది టూరిస్టులను ఉగ్రవాదులు పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం భారత్-పాక్(Bharat - Pak) దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి పాకిస్తాన్ అని బహిరంగంగా నినాదాలు చేయడంతో ఆగ్రహం చెందిన స్థానికులు అతనిపై మూకుమ్మడిగా దాడి(Mob Licking )కి దిగారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దుర్ఘటన కర్ణాటక(Karnataka)లోని మంగుళూరు(Manguluru)లో ఈ నెల 27న ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయగా.. అక్కడే ఉన్నవారు అతనిపై దాడికి దిగి, కొట్టి చంపారని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి పరమేశ్వర(Minister Parameshwara) పేర్కొన్నారు.
అయితే మృతుడు ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన మంత్రి, ఈ మాబ్ లిచింగ్ ఘటనలో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. అయితే కన్నడ నాట ఈ సంఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుండగా.. ఇలాంటి ఘటన జరగడంతో స్థానిక మీడియాలో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.






