- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింధు నది నీళ్లు ఇవ్వకపోతే మళ్ళీ యుద్ధమే.. పాకిస్థాన్ వార్నింగ్ !
మన ఇండియా ( India) చేతిలో చావు దెబ్బ తిన్నా కూడా... పాకిస్తాన్ ( Pakisthan) బుద్ధి మారడం లేదు. పొద్దున లేస్తే చాలు ఇండియ

దిశ, వెబ్ డెస్క్: మన ఇండియా ( India) చేతిలో చావు దెబ్బ తిన్నా కూడా... పాకిస్తాన్ ( Pakisthan) బుద్ధి మారడం లేదు. పొద్దున లేస్తే చాలు ఇండియా పై ఏదో బురద జల్లడం... లేదా దొంగచాటు దెబ్బ తీయడం తప్ప.. పాకిస్తాన్ కు ఏది చేతకాదు. ఎదురుగా నిల్చోని యుద్ధం చేసే... దమ్ము, ధైర్యం లేదు. గత నెల రోజుల కిందట.. ఇండియా చేతిలో దారుణంగా ఓడినా... పాకిస్తాన్ కు కొంచెం కూడా బుద్ధి రావడం లేదు.
చావు దెబ్బ తిని నెల రోజులు కూడా కాలేదు.. సంచలన వ్యాఖ్యలతో మళ్లీ ఇండియాను గెలుకుతోంది పాకిస్తాన్. సింధూ నది నీళ్లు ఇవ్వకపోతే ఇండియాతో యుద్ధమే అంటూ తాజాగా పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో (Bilawal Bhutto Zardari) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింధు నది జలాల ఒప్పందం ప్రకారం తమ దేశానికి నీళ్లు ఇవ్వకపోతే యుద్ధానికి వెళ్తామని వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
భారతదేశానికి రెండు ఆప్షన్స్ మాత్రమే.. ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఒకటి నీటిని సజావుగా పంపిణీ చేయడం... రెండోది సింధు బేసిన్ లోని ఆరు నదుల నుంచి నీటిని మమ్మల్ని తీసుకోనివ్వడం.. అంటూ హాట్ కామెంట్స్ చేశాడు. ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం నదీ జలాలను ఆపడం చట్ట వ్యతిరేకం అని గుర్తు చేశాడు. అయితే మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై ఇండియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ వాళ్లకు చుక్క నీళ్లు కూడా ఇచ్చేది.. లేదని తేల్చి చెప్తున్నారు.






