- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్ కాల్పుల విమరణ ఉల్లంఘన.. గుజరాత్ ప్రజలకు హోంమంత్రి కీలక సందేశం
భారత్ -పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని (Ceasefire Agreement) పాకిస్థాన్ (Pakistan) ఉల్లంగించింది.

దిశ, వెబ్ డెస్క్: భారత్ -పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని (Ceasefire Agreement) పాకిస్థాన్ (Pakistan) ఉల్లంగించింది. భారతదేశ దేశ సరిహద్దుల్లో మళ్లీ కాల్పులకు తెగబడుతోంది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir), రాజస్థాన్ (Rajasthan), పంజాబ్ (Panjab), గుజరాత్ (Gujarath) పై డ్రోన్లు, ఆర్టిలరి గన్‌లతో దాడికి చేస్తోంది. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పూర్తి బ్లాక్ అవుట్ (Block Out) విధించారు.
పాక్ చేస్తున్న డ్రోన్ దాడులను గుర్తించిన భారత బలగాలు అప్రమత్తమై.. పాకిస్థాన్ కు ధీటుగా సమాధానం ఇస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి (Gujarath Home Minister Harsh Sangavi) ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. డ్రోన్ దాడులపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన.. కచ్ జిల్లాలో అనేక డ్రోన్లు కనిపించాయని అన్నారు. దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో పూర్తిగా బ్లాక్అవుట్ అమలు చేయబడుతుందని తెలిపారు. దయచేసి ప్రజలు సురక్షితంగా ఉండండి, భయపడవద్దు అని హోంమంత్రి సూచించారు.






