మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడిన పాక్..

by Naga Rani Yarlagadda |

పదే పదే పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. 9వ రోజు కూడా పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడిన పాక్..
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్‌లో ఉగ్రదాడి (Pahalgam Terror Attack) జరిగి 10 రోజులు కావస్తున్నా.. భారత్ - పాక్ సరిహద్దుల్లో (LoC) ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గలేదు. పదే పదే పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని భారత్ హెచ్చరించినా.. పాక్ పట్టించుకోకపోవడం గమనార్హం. 9వ రోజు కూడా పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కుప్వారా, యూరీ, అఖ్నూర్ లో పాక్ కాల్పులు జరిపింది. భారత సైనిక పోస్టులే లక్ష్యంగా చేసుకుని పాక్ కాల్పులు జరపగా.. భారత సైన్యం ఆ కాల్పుల్ని చాకచక్యంగా తిప్పికొట్టింది.

ఏప్రిల్ 22న పహల్గామ్ లోని బైసరన్ లోయలో (Baisaran Valley) జరిగిన ఉగ్రదాడిలో 27 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం బీఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ వింగ్ (BSF Intelligence Wing) సమాచారం మేరకు పంజాబ్ పోలీసులు (Punjab Police), బీఎస్ఎఫ్ బలగాలు కలిసి నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో పెద్దఎత్తున ఆయుధాలు లభ్యమయ్యాయి. దీనివల్ల అతిపెద్ద ఉగ్రకుట్ర భగ్నమైనట్లు అధికార యంత్రాంగం అభిప్రాయపడింది.

Next Story