- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్.. పలు నగరాల్లో పూర్తి బ్లాక్ అవుట్
భారత్- పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి గంటలు కూడా గడవకముందే మళ్లీ కాల్పుల మోతలు వినిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: భారత్- పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire Agreement) జరిగి గంటలు కూడా గడవకముందే మళ్లీ కాల్పుల మోతలు వినిపిస్తున్నాయి. జమ్ము కశ్మీర్ (Jammu Kashmir) సరిహద్దులో పాకిస్థాన్ (Pakistan) డ్రోన్లతో దాడులు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. దీనిపై జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Jammu Kashmir CM Omar Abdullah).. శ్రీనగర్ (Srinagar) పరిధిలో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో దేశ సరిహద్దు జిల్లాల్లో పలు చోట్ల బ్లాక్ అవుట్ (Block Out) ప్రకటించారు.
ఇందులో భాగంగా జమ్ము కశ్మీర్ లోని ఉదంపూర్, శ్రీనగర్ ప్రాంతాల్లో, రాజస్థాన్ లోని బార్మర్, జైసల్మీర్ ప్రాంతాలతో పాటు పంజాబ్ లోని ఫిరోజ్ పూర్, పఠాన్ కోట్, మోగ ప్రాంతాల్లో కూడా అధికారులు పూర్తి బ్లాక్ అవుట్ విధించారు. అంతేగాక నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పులకు జరుపుతుండటంతో ఎల్ఓసీ వెంబడి బ్లాక్ అవుట్ ప్రకటించారు. ఇదిలా ఉండగా పాకిస్థాన్ కాల్పుల విమరణ ఒప్పందం ఉల్లంఘించి జమ్ము కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలపై వరుస డ్రోన్ దాడులకు తెగబడుతోంది. దీంతో అప్రమత్తమైన భారత్ పాక్ డ్రోన్ దాడులను ధీటుగా ఎదుర్కొంటుంది.






