- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pakistan: పంజాబ్‌లో కలకలం.. పాక్ చొరబాటుదారుడి అరెస్ట్
భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వేళ బార్డర్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ పాక్ (India pakisthan) మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వేళ బార్డర్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ (Gurudas pur)లో భారత భూభాగంలోకి చొరబడిన పాక్ పౌరుడిని బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (BSF) అరెస్టు చేసింది. భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దులోని ఠాకూర్పూర్ గ్రామంలో అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద నుంచి పాక్ జాతీయత కలిగిన గుర్తింపుకార్డు, రూ. 40వేల విలువైన పాక్ కరెన్సీ గుర్తించారు. ఆ వ్యక్తి అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో తిరుగుతూ అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించాడని పంజాబ్ పోలీసు వర్గాలు తెలిపాయి. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఆయనను విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ చొరబాటుజరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజస్థాన్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఒక పాకిస్తానీ రేంజర్‌ను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్న రెండు రోజులకే ఈ ఘటన జరగడంతో బార్డర్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అంతకుముందు అమృత్‌సర్‌లోని ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు, వైమానిక స్థావరాల సున్నితమైన సమాచారం, ఛాయాచిత్రాలను పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐకి లీక్ చేశారనే ఆరోపణలపై పంజాబ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.






