పాక్ వర్సిటీలో భగవద్గీత, మహాభారతం క్లాసులు!

by Phanindra |

పాక్ వర్సిటీలో భగవద్గీత, మహాభారతం క్లాసులు చెప్తున్నారు. సంస్కృతం భాష కోర్సును వీటితో నేర్పుతున్నారు.

పాక్ వర్సిటీలో భగవద్గీత, మహాభారతం క్లాసులు!
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌లో సంస్కృతం పాఠాలు మొదలయ్యాయి. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (ఎల్‌యూఎంఎస్)లో సంస్కృతం క్లాసులను ప్రారంభించారు. ఈ క్రమంలోనే మహాభారతం, భగవద్గీత శ్లోకాలను చదివించారు. ఇది పాకిస్తాన్ విద్యారంగంలో చారిత్రక నిర్ణయమని పలువురు కొనియాడుతున్నారు. మహాభారత్ టీవీ సీరియల్ థీమ్ సాంగ్ ‘హై కథా సంగ్రామ్ కీ’ (ఇది యుద్ధం గురించిన కథ) పాటను కూడా ఉర్దూలో అనువదించి, విద్యార్థులతో పాడిస్తోందీ యూనివర్సిటీ. సంస్కృతంపై మూడు నెలల వర్క్‌షాప్ నిర్వహించగా.. విద్యార్థులు, స్కాలర్ల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, దీంతో ఈ భాషను నేర్పించాలనే నిర్ణయం తీసుకున్నామని ఎల్‌యూఎంఎస్ అధికారులు తెలిపారు.

2027 నుంచి ఏడాది నిడివి ఉండే కోర్సును అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇక్కడి ప్రొఫెసర్ షాహిద్ రషీద్ ఈ విషయంలో చాలా కృషి చేసినట్లు తెలుస్తోంది. ‘సింధూ నాగరికత సమయంలో ఈ ప్రాంతంలోనే ఎంతో రాశారు. అది మాకూ చెందినదే. సంస్కృతం ఒక మతానికి చెందినది కాదు. మేం నేర్చుకుంటే తప్పులేదు. ఇది మొత్తం ఈ ప్రాంతాన్ని కలిపే భాష’ అని రషీద్ అన్నారు.

Next Story