- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్యాంటు, టీ-షర్టు వివాదం..ఒంటరి లేడీని చుట్టుముట్టిన పాకిస్తానీయులు..!
పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఓ యువతి చేసిన పని ముస్లిం పెద్దలకు కోపం తెప్పించింది. ఆ లేడీ బుర్కా ధరించకుండా టీ షర్ట్, ప్యాంట్ ధరించింది.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ లో మహిళల పట్ల కఠినమైన రూల్స్ అమలు చేస్తారు. వాళ్ల వేష ధారణ.. తదితర ఇష్టాలపై కఠిన ఆంక్షలు ఉంటాయి. ఇండియాలో ఉన్నట్లుగా పాకిస్తాన్ లో పరిస్థితులు ఉండవు. కచ్చితంగా మహిళలు ప్యాంటు, టీ-షర్టు కాకుండా బుర్కాలు ధరించి మాత్రమే బయటికి రావాలి. అయితే తాజాగా పాకిస్తాన్ లో ఓ లేడీ, చేసిన పని అక్కడి ముస్లిం సంఘాలకు కోపం తెప్పించింది. దీంతో ఆ లేడీని అందరూ కలిసి దారుణంగా కొట్టే ప్రయత్నం కూడా చేశారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
పాకిస్తాన్ లేడీపై దాడికి యుద్ధం
పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఓ యువతి చేసిన పని ముస్లిం పెద్దలకు కోపం తెప్పించింది. ఆ లేడీ బుర్కా ధరించకుండా టీ షర్ట్, ప్యాంట్ ధరించింది. దీంతో స్థానికంగా ఉన్న ముస్లింలందరూ ఏకమయ్యారు. ఆ లేడీ పై దాడికి ప్రయత్నించారు. తమ సాంప్రదాయానికి విరుద్ధంగా దుస్తులు ఉన్నాయని, ఎటాక్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ లేడికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంత వాదించినా.. అక్కడి గుంపు వినలేదు. ఆ లేడిని టార్గెట్ చేసి పై పైకి వచ్చారు. లైంగికంగా కూడా వేధించారట. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక దీనిపై పాకిస్తాన్ లోని మానవ హక్కుల సంఘాలు చాలా సీరియస్ అయ్యాయి. అంతేకాదు బాధిత మహిళ తరఫున పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి, అందరిపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి సంఘటన గతంలో లాహోర్ లో కూడా జరిగిన సంగతి తెలిసిందే. క్లిక్






