Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ 2.0 పేరు వినగానే వణుకుతున్న పాక్.. ఈ సారి టార్గెట్ ఇదే.. పాక్ ఆర్మీకి నిద్రలేని రాత్రులు

by Vennela |

Operation Sindoor: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై ఆపరేషన్ సిందూర్ పేరిట జరిపిన దాడి.. ఆ దేశంలో భూకంపం సృష్టించింది.

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ 2.0 పేరు వినగానే వణుకుతున్న పాక్.. ఈ సారి టార్గెట్ ఇదే.. పాక్ ఆర్మీకి నిద్రలేని రాత్రులు
X

దిశ, వెబ్ డెస్క్: Operation Sindoor: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై ఆపరేషన్ సిందూర్ పేరిట జరిపిన దాడి.. ఆ దేశంలో భూకంపం సృష్టించింది. ఏకంగా తొమ్మిది ప్రాంతాలపై మిస్సైల్స్ తో దాడి చేయడం ఇది తొలిసారి అని చెప్పవచ్చు. గతంలో బాలాకోట్, అలాగే సర్జికల్ స్ట్రైక్స్ వంటివి నిర్వహించినప్పటికీ, వాటితో పోల్చి చూస్తే ఇది అతి పెద్ద దాడి అని చెప్పవచ్చు.

జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ పైన కూడా ఈ దాడి జరిగింది దీంతో సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు వార్తలు వస్తున్నాయి. టెర్రర్ మాస్టర్ మైండ్ హఫీస్ సయీద్ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిందని వార్తలు వస్తున్నాయి, అసలు హఫీజ్ సయీద్ కూడా హతం అయి ఉండవచ్చు అని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ ఇంతటితో ఆగిపోలేదని దీని 2.0 సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి.

తాజాగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మనోజ్ నరవానే పిక్చర్ అబి బాకీ హే అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆపరేషన్ సిందూర్ పూర్తి కాలేదని పాకిస్తాన్ కు మరోసారి బుద్ధి చెప్పడం ఖాయమని వార్తలు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే జరిగిన దాడికి పాకిస్తాన్ అతలాకుతలం అవుతుంటే, ఈసారి 2.0 మరింత ఎక్కువ దాడి జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై ఇప్పటికే దాడులు జరిగాయి. అయితే ఈ ఉగ్రవాద శిబిరాల వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ఉన్నారు. వీరిపై సర్జికల్ స్గ్రైక్స్ జరిగే అవకాశం ఉందని వారంతా ఇప్పటికే అండర్ గ్రౌండ్లోకి చేరుకున్నారు. ఒకవేళ ఈ టెర్రరిస్టు మాస్టర్ మైండ్స్ ను అంతమొందిస్తే, పాకిస్తాన్ గడచిన కొన్ని దశాబ్దాలుగా తయారు చేస్తూ వచ్చిన ఉగ్ర భూతం సర్వనాశనం అవడం ఖాయం అని రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు.

Next Story