- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pakistan: పెహల్గామ్ ఉగ్రదాడి.. అప్రమత్తమైన పాక్.. కరాచీ తీరంలో క్షిపణి పరీక్షలు
పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ అప్రమత్తమైంది. భారత్ ప్రతీకార చర్యలు దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా పాక్ వ్యవహరిస్తుంది.

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ అప్రమత్తమైంది. భారత్ ప్రతీకార చర్యలు దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా పాక్ వ్యవహరిస్తుంది. భారతదేశంతో ఉద్రిక్తతల మధ్య పాకిస్థాన్ క్షిపణి పరీక్షలు చేసేందుకు సిద్ధమైంది. కరాచీ తీరంలో ఉపరితలలం నుంచి క్షిపణిని పరీక్షించడానికి నోటిఫికేషన్ జారీ చేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటలకు పాకిస్థాన్ ఏజెన్సీలు ఈ నోటిఫికేషన్ జారీ చేశాయి. పెహల్గాం ఉగ్రదాడి ఘటనపై భద్రతా కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించే టైంలో ఈ నోటిఫికేషన్ రావడం గమనార్హం. ఏప్రిల్ 24 - 25 మధ్య క్షిపణి పరీక్ష జరుగుతుందని సమాచారం. భారత ఏజెన్సీలు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయని తెలుస్తోంది. ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని భద్రతా వర్గాలు తెలిపాయి.
పెహల్గాం ఉగ్రదాడి తర్వాత..
పెహల్గామ్‌లో మంగళవారం ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019 పుల్వామా దాడి తర్వాత కశ్మీర్ లో జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఇది ఒకటి. అంతేకాకుండా, ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. మరోవైపు, ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ-సీసీఎస్ సమావేశంలో ఐదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. భారత్‌లోకి పాక్ పౌరులు రాకుండా నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. అంతేకాకుండా రెండు దేశాల మధ్య కీలకంగా ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇక భారత్-పాక్ దేశాల మధ్య ఉన్న అట్టారీ చెక్‌పోస్ట్‌ను ఇప్పటికిప్పుడు మూసివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని పాకిస్తాన్ రక్షణ, సైనిక, నేవీ, వైమానిక సలహాదారులు వారం రోజుల్లో తమ దేశానికి వెళ్లిపోవాలని సూచించింది. అంతేకాకుండా ఇస్లామాబాద్‌లోని భారత్ హై కమిషన్ తరఫున ఉంటున్న రక్షణ, నేవీ, వైమానిక సలహాదారులను వెనక్కి రప్పిస్తున్నట్లు ప్రకటించింది.






