Pakistan: రెండ్రోజుల్లో రెండు మిస్సైల్స్ ని పరీక్షించిన పాక్

by Shamantha N |

పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. భారత్ పాక్ పై కఠిన చర్యలు తీసుకుంటుంది.

Pakistan: రెండ్రోజుల్లో రెండు మిస్సైల్స్ ని పరీక్షించిన పాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. భారత్ పాక్ పై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి సమయంలో పాకిస్థాన్ వరుసగా మిస్సైల్స్ పరీక్షిస్తుంది. రెండ్రోజుల్లోనే రెండు క్షిపణులను పరీక్షించింది. పాక్ సోమవారం ఫతే అనే సర్ఫేస్-టు-సర్ఫేస్ మిస్సైల్‌ను పరీక్షించింది. 120 కిలోమీటర్ల రేంజ్‌ శత్రు స్థావరాల్ని నిర్విర్యం చేస్తుందని ఇస్లామాబాద్ ఆర్మీ ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ప్రకటన విడుదల చేసింది. ఈ మిసైల్‌ టెస్ట్‌ ప్రధానంగా మిస్సైల్‌ హార్డ్‌వేర్‌,సాఫ్ట్‌వేర్‌ పనితీరును పరీక్షించడం, అలాగే మిస్సైల్‌లో వాడిన ఆధునిక నావిగేషన్ వ్యవస్థ కచ్చితత్వాన్ని నిర్ధారించడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొంది.

రెండ్రోజులకు ముందే..

కాగా.. ఈ ప్రయోగానికి రెండ్రోజుల ముందు పాకిస్థాన్ 450 కిలోమీటర్ల రేంజ్‌అబ్దాలి వెపన్ సిస్టమ్ మిస్సైల్‌ను పరీక్షించినట్టు ప్రకటించింది. భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ ఇస్లామాబాద్ మిలటరీ చర్యలు ఆందోళనకరంగా మారాయి. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో, పాక్‌పై భారత్‌ ఆంక్షలు విధించింది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాక్ పౌరులకు జారీ చేసిన వీసాలను రద్దు వంటి చర్యలు ఉన్నాయి. మరోవైపు, పాకిస్తాన్ తరచూ నియంత్రణ రేఖ (LoC) వద్ద కాల్పులకు పాల్పడుతుండగా, భారత్ కూడా గట్టిగా ప్రతిస్పందిస్తోంది.

Next Story