- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Golden Temple: ఆపరేషన్ సిందూర్., గోల్డెన్ టెంపుల్ ని టార్గెట్ చేసిన పాక్
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్‌తో పాక్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మే 7న పాక్ లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై మిస్సైళ్లతో విరుచుకుపడింది.

దిశ, నేషనల్ బ్యూరో: పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్‌తో పాక్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మే 7న పాక్ లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై మిస్సైళ్లతో విరుచుకుపడింది. అయితే, ఆ తర్వాత పాక్ పంజాబ్ అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడి చేసినట్లు 15వ ఇన్‌ఫాంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC) మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి సోమవారం మీడియాకు తెలిపారు స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న అన్ని డ్రోన్‌లు, క్షిపణులను ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సమర్థంగా తిప్పికొట్టినట్లు వెల్లడించారు. ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన దాడులతో ఉక్కిరిబిక్కిరైన పాకిస్థాన్ మన దేశంలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు. సైనిక స్థావరాలు, నివాస ప్రాంతాలు, ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకుంటుందని భారత సైన్యం ముందుగానే ఊహించిందని తెలిపారు. ఇందులో స్వర్ణ దేవాలయం అత్యంత ప్రముఖమైనదిగా భావించి అక్కడ పూర్తిస్థాయి వైమానిక రక్షణ కల్పించినట్లు వివరించారు.
వైమానికి దాడులు..
అంతేకాకుండా, మే 8న పాక్ మానవరహిత వైమానిక దాడులు చేపట్టిందని మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి అన్నారు. ప్రధానంగా డ్రోన్లు, దీర్ఘ-శ్రేణి క్షిపణులతో భారీ వైమానిక దాడులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, L-70 ఎయిర్ డిఫెన్స్ గన్స్ వంటి భారత వైమానిక రక్షణ వ్యవస్థలు అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని, పంజాబ్ లోని నగరాలను పాక్ దాడుల నుంచి ఎలా కాపాడాయో వీడియోను కూడా ప్రదర్శించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సాయుధ దళాలు పాక్ లోని అనేక ప్రదేశాలను "సంపూర్ణ కచ్చితత్వంతో" లక్ష్యంగా చేసుకున్నాయని అన్నారు. ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్న మురిద్కే, బహవల్పూర్ వంటి ప్రాంతాలను దాడి చేశాయని మేజర్ జనరల్ చెప్పారు.






