Bharat-Pak Conflicts : కవ్వింపు చర్యలకు దిగిన పాక్.. 'ఫతహ్' క్షిపణి ప్రయోగం

by Muthe.Rajitha |

పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం భారత్-పాక్(Bharat-Pak) మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

Bharat-Pak Conflicts : కవ్వింపు చర్యలకు దిగిన పాక్.. ఫతహ్ క్షిపణి ప్రయోగం
X

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం భారత్-పాక్(Bharat-Pak) మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు దేశాల మధ్య అన్ని రకాల సంబంధాలను తెగదెంపులు చేసుకొని.. యుద్ధానికి రెడీ అయ్యాయి. అయితే ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. ఇది వరకే 450 కిమీల రేంజ్ 'అబ్దాలి' క్షిపణిని ప్రయోగం చేపట్టగా.. సోమవారం మరోసారి 120 కిలోమీటర్ల రేంజ్ ఉన్న 'ఫతహ్'(Fatah) సిరీస్‌కి చెందిన ఒక సర్ఫేస్-టు-సర్ఫేస్ బాలిస్టిక్ క్షిపణి(Ballistic missile)ని ప్రయోగించినట్టు తెలుస్తోంది.

"ఇండస్"(Indus) అనే సైనిక విన్యాసంలో భాగంగా జరిగిన 'ట్రైనింగ్ లాంచ్' అంటే యుద్ధ సన్నాహకాల్లో భాగంగా దీనిని ప్రయోగించామని పాకిస్తాన్ పేర్కొంది. కాని భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో పాక్ ఈ ప్రయోగం చేపట్టడం రెచ్చగొట్టే చర్యగా భారత్ చూస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో, జాతీయ వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story