- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > భారత్-పాక్ సమస్యలకు కశ్మీరే కారణం.. ఆర్టికల్ 370 మళ్లీ అమలు చెయ్యాలి: పాక్ ప్రధాని
భారత్-పాక్ సమస్యలకు కశ్మీరే కారణం.. ఆర్టికల్ 370 మళ్లీ అమలు చెయ్యాలి: పాక్ ప్రధాని
భారత్-పాక్ ఉద్రిక్తతలకు కశ్మీరే కారణం అని, ఆర్టికల్ 370 రద్దు భారత్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు కశ్మీర్ అంశమే ప్రధాన సమస్య అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. అదే సమయంలో 2019లో జమ్మూకశ్మీర్ స్వయంప్రతిపత్తిని తొలగిస్తూ తీసుకున్న నిర్నయాన్ని కూడా షరీఫ్ విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రతి ఏటా పాక్ నిర్వహించే యూమ్-ఇ-ఇస్తేసల్ కార్యక్రమంలో షరీఫ్ మాట్లాడారు.
ఇదే భారత్, పాక్ మధ్య సమస్యలకు కారణమన్న ఆయన.. ‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం మేరకు కశ్మీరీ ప్రజలకు న్యాయం జరగాలి. అదొక్కటే మన ముందున్న మార్గం’ అని చెప్పారు. పాక్ విదేశాంగ విధానంలో కశ్మీర్ సమస్యను నిజాయితీగా, ప్రశాతంగా పరిష్కరించడమే కీలకాంశమన్నారు. భారత్ ఏకపక్షంగా ఆర్టికల్ 370 రద్దు చేసిందని, ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చేయడంలో ప్రపంచ దేశాలు నిర్ణయాత్మక పాత్ర పోషించాలని సూచించారు.
Next Story






