- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీజ్‌ఫైర్‌లో మరో దేశం జోక్యాన్ని భారత్ ఒప్పుకోలేదు: పాక్ డిప్యూటీ పీఎం
సీజ్‌ఫైర్‌లో మరో దేశం జోక్యాన్ని భారత్ ఒప్పుకోలేదని పాక్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ చెప్పారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలపై పాక్ నీళ్లు కుమ్మరించినట్లయింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న సమస్యల్లో మరో దేశం జోక్యం చేసుకోవడాన్ని భారత్ ఎప్పుడూ అంగీకరించలేదని పాక్ డిప్యూటీ పీఎం, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అంగీకరించారు. ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విమరణ చేయించింది తానేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు ప్రకటించుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఒక ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషాక్ దార్ ఈ కామెంట్స్ చేశారు.
‘మూడో దేశం జోక్యం చేసుకోవడానికి భారత్ ఎన్నడూ అంగీకరించలేదు’ అని ఆయన వెల్లడించారు. మే 10న సీజ్‌ఫైర్ ఆఫర్ చేసిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తటస్థ వేదికపై చర్చలు జరుగుతాయని యూఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో తనతో చెప్పారని దార్ వెల్లడించారు. ‘జులై 25న ఈ విషయం గురించి మళ్లీ ఆయన్ను అడిగాను. కానీ భారత్ ఇది ద్వైపాక్షిక సమస్య అంటోందని, వేరే దేశపు జోక్యం అంగీకరించడం లేదని ఆయన చెప్పారు. మరో దేశం జోక్యం చేసుకున్నా.. చేసుకోకపోయినా మాకు సమస్యేమీ లేదు. కానీ భారత్ మాత్రం ఇది ద్వైపాక్షిక సమస్యేనని వాదిస్తోంది.
అయితే చర్చలు మాత్రం ఉగ్రవాదం, వాణిజ్యం, జమ్మూకశ్మీ తదితర సమస్యలన్నింటి మీదా జరగాలి. మేం దేనికోసం అడుక్కోవడం లేదు. మాది శాంతి కాముక దేశం. చర్చలతోనే పురోగతి ఉంటుందని నమ్ముతాం. అటువైపు నుంచి కూడా అలా ఉంటేనే పరిస్థితులు మారతాయి’ అని దార్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో భారత్, పాక్ మధ్య తానే సీజ్‌ఫైర్ చేయించానని డొనాల్డ్ ట్రంప్ చేసుకుంటున్న ప్రచారంపై పాక్ నీళ్లు కుమ్మరించిందని విశ్లేషకులు అంటున్నారు.






