ట్రేడ్ డీల్‌ కోసం పాక్ పరుగులు.. వచ్చే వారం యూఎస్‌కు పాక్ బృందం!

by Phanindra |   (  Updated:2025-05-31 15:45:34  IST  )

యూఎస్‌ ట్రేడ్ డీల్‌ కోసం పాక్ పరుగులు పెడుతోంది. వచ్చే వారం వాషింగ్టన్‌కు పాక్ బృందం వస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

ట్రేడ్ డీల్‌ కోసం పాక్ పరుగులు.. వచ్చే వారం యూఎస్‌కు పాక్ బృందం!
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు పాకిస్తాన్ పరుగులు తీస్తోంది. ఆ దేశ బృందం వచ్చే వారంలోనే యూఎస్‌కు రాబోతోందని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ప్రపంచ దేశాలపై గత నెల ట్రంప్ ప్రకటించిన సుంకాలు అమలైతే.. యూఎస్‌కు పాకిస్తాన్‌ నుంచి వచ్చే ఎగుమతులపై 29 శాతం సుంకాలు పడతాయి. అమెరికాతో పాకిస్తాన్ 3 బిలియన్ డాలర్ల ట్రేడ్ సర్‌ప్లస్ కలిగి ఉంది. ఈ కారణంగానే పాక్‌పై 29 శాతం టారిఫ్‌లు వేయాలని ట్రంప్ నిర్ణయించారు.

భారత్, పాక్ ఉద్రిక్తతల సమయంలో కూడా ఇదే విషయం చూపించి దాయాది దేశాన్ని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ భయపెట్టినట్లు సమాచారం. యుద్ధాలు చేసే దేశాలతో వ్యాపారం చేయాలనే ఆలోచన తనకు లేనట్లు ట్రంప్ చెప్పడంతో పాక్ వెనక్కు తగ్గిందని యూఎస్ వర్గాలంటున్నాయి. ఇక భారత్‌తో కూడా త్వరలోనే ట్రేడ్ డీల్ చేసుకుంటామని ట్రంప్ చెప్పారు. ప్రస్తుతం యూఎస్‌కు భారత్ చేసే ఎగుమతులపై అగ్రరాజ్యం 26 శాతం సుంకాలు విధిస్తోంది.

Next Story