చర్చలపై RSS వ్యాఖ్యలు.. స్పందించిన పాకిస్థాన్

by velandi.Saikiran |

పాకిస్తాన్ తో చర్చలు జరపడంపై ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ కార్యాలయం కీలక ప్ర‌క‌ట‌న‌ చేసింది.

చర్చలపై RSS వ్యాఖ్యలు.. స్పందించిన పాకిస్థాన్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియా, పాకిస్తాన్ మధ్య నిత్యం గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో పాకిస్తాన్ తో చర్చలు జరపడంపై ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ కార్యాలయం కీలక ప్ర‌క‌ట‌న‌ చేసింది. చర్చలపై ఇండియా స్వరాలు వినిపించడం నిజంగా సానుకూల అంశం.. ఇలాంటి పిలుపు రావడం చాలా బాగుందని పేర్కొంది పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం. అయితే ఈ విషయంలో భారత దేశంలో అధికారిక స్పందన ఉంటుందో లేదో చూడాలని వెల్లడించింది.

దీనిపై ఇండియన్ సర్కార్ నిర్ణయాన్ని చెప్పాల్సిన పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. అప్పటి వరకు ముందుకు వెళ్లలేమని పేర్కొంది. ఆర్ఎస్ఎస్ నుంచి ప్రతిపాదనలు కాకుండా ఇండియన్ సర్కార్ నుంచి రావాలని తెలిపింది పాకిస్తాన్ దేశంగా కార్యాలయం. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ తో చర్చలకు తలుపులు మూసేయకూడదని... ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలని ఇటీవల దత్తాత్రేయ వెల్లడించారు. రెండు దేశాల మధ్య చర్చలు ఎన్నిటికైనా జరగాల్సిందేనని తెలిపారు.

Next Story