తొలిసారి ట్రంప్‌తో పాక్ ప్రధాని భేటీ.. మీడియాకు మాత్రం నో ఎంట్రీ!

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-26 04:41:19  IST  )

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు.

తొలిసారి ట్రంప్‌తో పాక్ ప్రధాని భేటీ.. మీడియాకు మాత్రం నో ఎంట్రీ!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. ఆయనతో పాటు ఈ సమావేశంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కూడ ఉన్నారు. వైట్‌హౌస్‌లోని ఓవల్‌ ఆఫీసులో వారి సమావేశం జరిగింది. అయితే, ఈ భేటీకి మీడియాను అనుమతించకపోవడం ఆసక్తికరంగా మారింది అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.52 గంటలకు పాక్‌ (Pakistan) ప్రధాని షరీఫ్‌ (Shahbaz Sharif) టీమ్ వైట్‌హౌస్‌కు చేరుకుంది. అయితే పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ట్రంప్‌తో భేటీ అవడం ఇదే మొదటిసారి. 2019లో చివరిసారిగా నాటి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశమయ్యారు. 2015లో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ 2015లో అమెరికాలో పర్యటించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆమెరికా, పాక్ మధ్య ప్రస్తుత చర్చలు హాట్ టాపిక్‌గా మారాయి.

Next Story