- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జైల్లో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి? ఇమ్రాన్ ను చూపించాలని జైలు బయట ఆందోళనలు
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో చనిపోయారనే వార్తలు దావనంలా వ్యాపించాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: జైలు జీవితం గడుపుతున్న పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి, ఆ దేశ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ (Former Pakistan Prime Minister Imran Khan) చనిపోయారా? జైల్లోనే ఆయన కాలం చేశారా? ఇమ్రాన్‍ను రహస్యంగా చంపేశారని అప్ఘాన్ మీడియాకథనాలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. ఆయన జైల్లో చనిపోయినట్లు నిన్నటి నుంచి వార్తల వెల్లువెత్తడంతో ఇమ్రాన్ ఖాన్‍ను తమకు చూపించాలంటూ ఆయన సోదరీమణులతో పాటు వేలాది మంది ఆయన అభిమానులు రావల్పిండిలోని అడియాలా జైలు వద్దకు తరలివచ్చి ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ కు ఏం జరిగింది? ఆయన నిజంగానే చనిపోయారా లేక ఇదంతా మీడియా సృష్టేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అనుకున్నంత పని జరిగిపోయిందా?
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ 2018లో ఆ దేశ ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాన మంత్రి అయ్యారు. అయితే ఐదేళ్లు పదవిలో కొనసాగకుండానే అర్థాంతరంగా ఆయన పదవీచ్యుతుడిగా మారారు. అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి దిగిపోయాక ఆయనపై అవినీతి, హింస, దైవదూషణ, హత్య, ఉగ్రవాదం వంటి రకరకాల ఆరోణలతో 20కి పైగా కేసుల్లో అతనికి శిక్ష విధించారు. ఈ క్రమంలో 2023 నుంచి ఆయన అడియాలా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే తనపై నమోదైన కేసులనన్నీ రాజకీయ కుట్రతో చేసినవేనని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలో అతని ఆ దేశ సైనికాధిపతి అసీమ్ మునీర్‍పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. డెమక్రసీనీ చీల్చి ‘అసీమ్ లా’ ను ప్రజలపై రుద్దుతున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన జైల్లోనే హత్యగావింపబడ్డారని ఇదంతా తమకు అందిన అనధికారిక సమాచారం అంటూ అఫ్ఘాన్ మీడియాలో కథనాలు రావడం కలకలం రేపుతోంది. అయితే ఇటీవల పాక్, అప్ఘాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పాక్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసేందుకే ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్లు ప్రచారం సృష్టిస్తున్నారా? లేక నిజంగానే చనిపోయారా అనేది ఉత్కంఠగా మారింది. అయితే తనను జైల్లోనే అంతం చేయాలని చూస్తున్నారని ఇప్పటికే అనేక సందర్భాల్లో ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన అనుమానమే నిజమైందా జరిగిందా అనే చర్చ జరుగుతోంది.
మూడు వారాలుగా నో ములాఖత్:
ఇమ్రాన్ ఖాన్ చనిపోయారనే ప్రచారం నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులు, ఆయన అభిమానులు, పీటీఐ పార్టీ మద్దతు దారులు భారీ సంఖ్యలో జైలు వద్ద బారులు తీరారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు సంచలన ఆరోపణలు చేశారు. తమను లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని తీవ్రంగా దాడి చేశారని ఆరోపించారు.జైలు బయట ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న తమపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని 71 ఏళ్ల వయసు ఉన్న తనతో పాటు అనేక మంది ఇతర మహిళళను జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టడంతో పాటు చెంప దెబ్బలు కొడుతూ ఈడ్చుకుపోయారని, ఈ దాడికి ముందు కావాలనే విద్యుత్ సరఫరా నిలిపివేశారని ఆరోపించారు. అలాగే గడిచిన మూడు వారాలుగా తమ సోదరుడు ఇమ్రాన్ ను కలవనివ్వడం లేదని ఇమ్రాన్ ఖాన్ సోదరి చేసిన ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి.






