- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యుద్ద భయం..ఆస్పత్రిలో చేరిన పాక్ ప్రధాని.. పరిస్థితి ఎలా ఉందంటే?
పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. ఆయన ఆస్పత్రిలో చేరినట్టు ఈనెల 27వ తారీఖునే పాక్ పీఎంఓ నుండి లెటర్ కూడా విడుదల చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. ఆయన ఆస్పత్రిలో చేరినట్టు ఈనెల 27వ తారీఖునే పాక్ పీఎంఓ నుండి లెటర్ కూడా విడుదల చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లెటర్‌లో ప్రధాని 27వ తారీఖున రవాల్ పిండిలోని మిలిటరీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. అంతే కాకుండా షాబాజ్ షరీఫ్ పైల్స్ వ్యాధికి చికిత్స పొందేందుకు ఆస్పత్రితో చేరినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటగానే ఉందని నిపుణుల సమక్షంలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఈ సమాచారాన్ని అధికారులు చాలా గోప్యంగా ఉంచాలని మీడియాకు చెప్పవద్దని పేర్కొన్నారు.
తాము ఆదేశాలు ఇచ్చేవరకు ఈ సమాచారం ఎవ్వరికీ చెప్పవద్దని తెలిపారు. ఈ లెటర్ ప్రధాని ప్రిన్సిపుల్ సెక్రటరీ అసద్ రెహ్మాన్ గిలానీ పేరుతో విడుదలైంది. అయితే ఇది నిజంగానే పీఎంఓ నుండి విడుదలైందా లేదంటే క్రియేట్ చేసిందా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఈ లెటర్ వైరల్ అవ్వడంతో పాక్ ప్రధానికి యుద్దం భయం పట్టుకుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. యుద్ధం భయంతో వణిపోతూనే షాబాజ్ ఆస్పత్రిలో చేరాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే నిజంగానే ఆస్పత్రిలో చేరాడా లేదా అనేదానిపై క్లారిటీ రావాలి అంటే అధికారిక ప్రకటన వెలుబడాల్సిందే.






