Pakistan: పాక్ చొరబాటుదారుడి కాల్చివేత.. పంజాబ్‌ సరిహద్దులో కలకలం

by B.Srinivas |

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో అంతర్జాతీయ సరిహద్దును అక్రమంగా దాటినందుకు గాను పాకిస్తాన్ చొరబాటుదారుడిని బీఎస్ఎఫ్ దళాలు కాల్చి చంపాయి.

Pakistan: పాక్ చొరబాటుదారుడి కాల్చివేత.. పంజాబ్‌ సరిహద్దులో కలకలం
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో అంతర్జాతీయ సరిహద్దును అక్రమంగా దాటినందుకు గాను పాకిస్తాన్ చొరబాటుదారుడిని బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (BSF) దళాలు కాల్చి చంపాయి. ఈ మేరకు బీఎస్ఎఫ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అమృత్ సర్‌ (Amrithsar)లో సరిహద్దు వద్ద విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ దళాలు సోమవారం ఉదయం ఓ వ్యక్తి అనుమానాస్పద కదలికలను గమనించాయి. ఆయన సరిహద్దు భద్రతా కంచెను దాటేందుకు ప్రయత్నిస్తుండగా అప్రమత్తమైన బలగాలు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలోనే తీవ్ర గాయాలపాలైన పాక్ పౌరుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కొట్రాజ్డా గ్రామం సమీపంలోని సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం ఘటనా ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి చొరబాటుదారుడి మృత దేహంతో పాటు ఓ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. చొరబాటు ప్రయత్నాన్ని బలగాలు విఫలం చేశాయని బీఎస్ఎఫ్ తెలిపింది.

Next Story