- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pakisthan: అమెరికా బాట పట్టిన పాక్.. చైనానే కారణమా ?
పాకిస్థా్న్ సైనికాధికారులు అమెరికా బాటపట్టారు. ఇటీవలే పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ యూఎస్‌లో పర్యటించారు.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థా్న్ సైనికాధికారులు అమెరికా బాటపట్టారు. ఇటీవలే పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ యూఎస్‌లో పర్యటించగా.. తాజాగా పాక్ వైమాణిక దళం చీఫ్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ సైతం అమెరికాకు వెళ్లారు. ఆ దేశంలో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఆయన టూర్ కొనసాగనున్నట్టు తెలుస్తోంది. తన పర్యటనలో జహీర్ అమెరికా వైమానిక దళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డేవిడ్ ఆల్విన్ సహా ఇతర అమెరికా సైనిక ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అయితే చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన ఆయుధాలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో జహీర్, మునీర్ పర్యటనలకు ప్రాధాన్యత సంతరించుకుంది. డిఫెన్స్ సామర్థ్యాలను బలోపేతం చేసుకునే ఉద్దేశంతోనే యూఎస్‌కు వెళ్తున్నట్టు సమాచారం. పాకిస్తాన్ తన వైమానిక దళాన్ని ఆధునీకరించడానికి ఎఫ్-16 ఫైటర్ జెట్, వైమానిక రక్షణ వ్యవస్థలతో సహా అనేక అధునాతన యూఎస్ సైనిక వేదికలపై దృష్టి సారించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అలాగే ఏఐఎం-7 స్పారో ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను, అమెరికా తయారు చేసిన హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ (HIMARS) బ్యాటరీలను కూడా కొనుగోలు చేయాలని పాక్ భావిస్తోంది. ఈ క్రమంలోనే వేగంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. కాగా, ఇటీవల భారత్ పాక్ యుద్ధం వేళ చైనా నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలు పూర్తిగా తేలిపోయిన విషయం తెలిసిందే. దీంతో చైనా మీద నమ్మకం కోల్పోయిన పాక్ యూఎస్ వైపు చూస్తోంది.






