- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pakisthan: భారత విమానాలకు పాక్ గగనతలం మూసివేత.. జూలై 23వరకు పొడిగింపు
భారత విమానాలపై గగనతల నిషేధాన్ని మరో నెల రోజులు పొడిగిస్తున్నట్టు పాక్ ప్రకటించింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత విమానాలపై గగనతల నిషేధాన్ని మరో నెల రోజులు పొడిగిస్తున్నట్టు పాక్ ప్రకటించింది. ఈ మేరకు పాక్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ సోమవారం ఎయిన్ మెన్‌కు నోటీస్ జారీ చేసింది. గతంలో విధించిన ఆంక్షలు జూన్ 23తో ముగియనుండగా దానిని జూలై 23వరకు పొడిగించింది. భారత్ లో రిజిస్టరై నడుస్తున్న, భారత విమానయాన సంస్థలు లేదా ఆపరేటర్లు నిర్వహించే విమానాలకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది. సైనిక విమానాలకు సైతం ఇదే రూల్ వర్తించనుంది. కాగా, ఉగ్రదాడి అనంతరం పాక్ పై భారత్ చర్యలు తీసుకోవడంతో దానికి బదులుగా పాక్ సైతం తన గగనతలాన్ని మూసివేసింది. గతంలో మే 23తో గడువు ముగియగా జూన్ 23 వరకు పొడిగించగా తాజాగా మరోసారి గడువు పెంచింది. ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేసింది. అనంతరం ఇరు దేశాల మధ్య కాల్పల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ ద్వైపాక్షిక సంబంధాలు ఇంకా మెరుగుపడలేదు.






