- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pakisthan: ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో తొమ్మిది మంది పౌరులు మృతి.. పాక్ ప్రభుత్వం వెల్లడి
ఖైబర్ పంఖ్తుంఖ్వా ప్రావీన్సులోని ఉగ్రవాద స్థావరాలపై పాక్ భద్రతా దళాలు డ్రోన్ దాడులు చేసిన విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: ఖైబర్ పంఖ్తుంఖ్వా ప్రావీన్సు (Khyber Pakhtunkhwa province) లోని ఉగ్రవాద స్థావరాలపై పాక్ భద్రతా దళాలు డ్రోన్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల వల్ల 12 మంది ఉగ్రవాదులు మరణించారు. అయితే ఉగ్రవాదులపై చేపట్టిన ఆపరేషన్‌లో తొమ్మిది మంది సాధారణ పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయినట్టు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. మర్దాన్ జిల్లాలోని కట్లాంగ్ కొండ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ చేపట్టి ఉగ్రవాదుల దాక్కున్న స్థావరాలను లక్ష్యంగా దాడి చేసినట్టు పేర్కొంది. టెర్రిస్టులు ఆ ప్రదేశాన్ని రహస్య స్థావరంగా, రవాణా కేంద్రంగా ఉపయోగిస్తున్నారనే ఇంటలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిపింది. ఘటన అనంతరం ఏడుగురు పురుషులు, ఇద్దరు మహిళల మృత దేహాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. మృతులు స్వాత్ జిల్లాకు చెందిన గొర్రెల కాపరులని స్థానికులు తెలిపారు.
ఈ ఘటనపై ఖైబర్ పఖ్తుంఖ్వా సీఎం అలీ అమీన్ గందాపూర్ స్పందిస్తూ.. టెర్రరిస్టు ఆపరేషన్ టైంలో పౌరులు మరణించడం బాధాకరమని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. మరోవైపు ఇటీవల వాహనాలపై అనేక ఉగ్రవాద దాడులు జరిగిన ప్రాంతంలో శాంతిభద్రతలు క్షీణించడంతో పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రభుత్వం అనేక ప్రధాన జాతీయ రహదారులపై రాత్రి ప్రయాణాన్ని నిషేధించింది.






