పాకిస్థాన్ కు అంతిమ గుణపాఠం నేర్పించాల్సిందే.. కాల్పులపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |

పాకిస్థాన్ (Pakistan) కు అంతిమ గుణపాఠం నేర్పించాల్సిందేనని కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ (Union Minister Jitan Ram Manjhi) అన్నారు.

పాకిస్థాన్ కు అంతిమ గుణపాఠం నేర్పించాల్సిందే.. కాల్పులపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ (Pakistan) కు అంతిమ గుణపాఠం నేర్పించాల్సిందేనని కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ (Union Minister Jitan Ram Manjhi) అన్నారు. భారత్ లో పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుకొని పాకిస్థాన్ జరుపుతున్న దాడులపై మీడియాతో మాట్లాడిన ఆయన.. పాక్ పై సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. పాకిస్థాన్ ఎప్పుడూ ఇలాంటి పిరికిపంద చర్యలకే పాల్పడుతుందని ఎద్దేవా చేశారు. అలాగే ఇదంతా వారే చేస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) సహా భారత సైన్యం (Indian Army) ఇప్పటికీ సంయమనంతోనే వ్యవహరిస్తున్నారని తెలిపారు.

భారత సైన్యం ఇంకా పాక్ పౌర ప్రాంతాలపై దాడి చేయలేదని, కానీ సహనానికి కూడా పరిమితి ఉంటుందని చెప్పారు. ఇక ప్రస్తుత పరిస్థితిని గమణిస్తే.. పాకిస్తాన్ కు అంతిమ గుణపాఠం (Final Lesson) నేర్పించాల్సిందేనని తాను అభిప్రాయపడుతున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు. భారత్ -పాక్ దేశాలు ఉద్రిక్తతలు తగ్గించి, చర్చలకు ముందుకు రావాలని సూచిస్తున్న వ్యక్తులు ఆ విషయాన్ని పాక్ కు చెప్పాలని అన్నారు. పాకిస్తాన్ దాడులకు తెగబడుతుంటే భారత బలగాలు మనల్ని మనం రక్షంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ఇక చర్చలకు పిలుపునిస్తున్న వ్యక్తులు మన స్నేహితులైతే, ఈ విషయంలో వారు మాకు మద్దతు ఇవ్వాలని మాంఝీ వెల్లడించారు.

Next Story