మా దేశంలో ఉగ్రవాదులు లేరు..: పాక్

by Phanindra |

పాకిస్తాన్‌లో అసలు ఉగ్రవాదులే లేరని ఆ దేశ రక్షణ మంత్రి బుకాయించాడు. ఉగ్రవాదం అనేది గతమని, ఇప్పుడు అందరూ బాగానే బతుకుతున్నారని చెప్పాడు.

మా దేశంలో ఉగ్రవాదులు లేరు..: పాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఆపరేషన్ సిందూర్’తో పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచం అంతా ‘టెర్రర్ హాట్‌స్పాట్‌లు’గా ఒప్పుకున్న ప్రాంతాలనే భారత్ టార్గెట్ చేసింది. అయితే పాకిస్తాన్‌లో అసలు ఉగ్రవాదులే లేరని ఆ దేశ రక్షణమంత్రి ఖ్వాజా ఆసిఫ్ బుకాయించాడు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పాకిస్తాన్‌లో టెర్రరిస్టులు ఉంటున్నారా?’ అని సూటిగా అడిగిన ప్రశ్నకు ఆసిఫ్ సమాధానమిచ్చారు. ‘లేదు.. పాక్‌లో ఉగ్రవాదులు లేరు. ఈ ఉగ్రవాదం అంతా గతంలో ఉండేది. ఇప్పుడు అలాంటి వారెవరూ మా దేశంలో లేరు’ అని చెప్పారు.

‘ఉగ్రవాదులని అందరూ అంటున్న వీళ్లంతా 1980ల్లో ఆఫ్ఘనిస్తాన్‌లో యూఎస్ సైనిక చర్యలకు సహాయం చేసిన వాళ్లే. ఇప్పుడ సడెన్‌గా యూఎస్, వాళ్ల మిత్ర దేశాలు తమ చేతులు కడిగేసుకున్నాయి. మా దేశంలో ఉన్న వారిని చూపించి మమ్మల్ని టెర్రరిస్టు దేశం అంటున్నారు. ఒకప్పుడు ఈ టెర్రరిస్టులంతా యూఎస్, దాని మిత్రదేశాలకు పనిచేసినవారే’ అని ఆసిఫ్ చెప్పుకొచ్చారు. ‘అసలు వీళ్లు టెర్రరిస్టులని ఎవరు డిసైడ్ చేస్తారు? ఇప్పుడు మా దేశంలో ఉగ్రవాద నాయకులు ఎవరూ లేరు. మా దేశంలోనే బతుకుతున్నారు కానీ.. పాకిస్తాన్‌లోకానీ, సరిహద్దు అవతల భారత్‌లో కానీ ఎలాంటి టెర్రరిస్టు కార్యకలాపాలకు వాళ్లు పాల్పడటం లేదు’ అని ఆసిఫ్ బుకాయించాడు.

అయితే పెహల్గాం దాడి జరిగిన సమయంలో యూకేకు చెందిన ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉగ్రవాదం గురించి ప్రశ్నించగా.. ‘మేం యూఎస్ కోసం గత 30 ఏళ్లుగా ఈ పని చేస్తూనే ఉన్నాం’ అని ఆసిఫ్ సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.

Next Story