- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IMF: పాకిస్తాన్ అన్ని షరతులను అంగీకరించాకే రుణమిచ్చాం:ఐఎంఎఫ్
గతేడాది సెప్టెంబర్‌లోనే పాకిస్తాన్‌కు ఇవ్వాల్సిన ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ(ఈఎఫ్ఎఫ్) ప్రోగ్రామ్‌కు ఆమోదం లభించిందన్నారు

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల భారత్‌తో వివాదం ఉన్నప్పటికీ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) పాకిస్తాన్‌కు రుణ సదుపాయం కల్పించడం పట్ల విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజా దీనిపై ఐఎంఎఫ్ వివరణ ఇచ్చింది. పాకిస్తాన్ అన్ని షరతులు, నిబంధనలను అంగీకరించిన తర్వాతే బోర్డు బిలియన్ డాలర్ల సాయన్ని మంజూరు చేసిందని తెలిపింది. మే 9న బోర్డు మొత్తం రుణమిచ్చేందుకు ఆమోదం తెలిపినట్టు ఐఎంఎఫ్‌లోని కమ్యూనికేషన్ విభాగం డైరెక్టర్ జూలీ కొజక్ చెప్పారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. గతేడాది సెప్టెంబర్‌లోనే పాకిస్తాన్‌కు ఇవ్వాల్సిన ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ(ఈఎఫ్ఎఫ్) ప్రోగ్రామ్‌కు ఆమోదం లభించిందని, ఆ సమయంలో మొదటి సమీక్ష 2025, తొలి త్రైమాసికంలో నిర్వహించాలని నిర్ణయించినట్టు వివరించారు. సమీక్ష పూర్తయిన తర్వాత తాజా సహాయం మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. అదే సమయంలో, ఈఎఫ్ఎఫ్ ప్రోగ్రామ్ షరతుల విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే ప్రోగ్రామ్ కింద భవిష్యత్తులో జరిగే సమీక్షలపై ప్రభావితం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు రుణాల మంజూరుకు సంబంధించి పురోగతిని అంచనా వేసేందుకు ఎప్పటికప్పుడు సమీక్షణలను నిర్వహిస్తుంది. ఇచ్చిన రుణాలు ప్రోగ్రామ్ పరిధిలోనే జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని ట్రాక్ చేస్తాం. అనుకున్న విధంగా కార్యక్రమం లక్ష్యాలు నెరవేరుతున్నాయా, లోపాలు ఉంటే సరిదిద్దేందుకు విధానపరమైన మార్పులు అవసరమా అనేది పరిశీలిస్తామని చెప్పారు. పాకిస్తాన్ విషయంలోనూ ఇదే జరిగిందని, ఆ దేశం అన్ని లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నందునే బోర్డు రుణం మజూరు చేసిందన్నారు. కొన్ని అంశాల్లో మార్పులు చేసిన కారణంగా బోర్డు ఈఎఫ్ఎఫ్ కార్యక్రమాన్ని ఆమోదించింది. పాకిస్తాన్‌కు ఈఎఫ్ఎఫ్ కింద ఇచ్చిన అన్ని చెల్లింపులు సెంట్రల్ బ్యాంక్ నిల్వలకు బదిలీ అవుతాయని జూలీ కొజక్ వివరించారు. కాబట్టి చెల్లింపులు బడ్జెట్ ఫైనాన్సింగ్‌లో భాగం కావు, ప్రభుత్వానికి చేరవని వెల్లడించారు.






