- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మకానికి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్... IMF రుణం కోసం సర్కార్ కీలక నిర్ణయం
పాకిస్తాన్ ప్రభుత్వం తన జాతీయ విమానయాన సంస్థ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) ను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమైంది.

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ ప్రభుత్వం తన జాతీయ విమానయాన సంస్థ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) ను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమైంది. గత రెండు దశాబ్దాలలో తొలిసారిగా పెద్ద ఎత్తున ఆస్తులను అమ్మకానికి పూనుకుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF నుంచి ఆర్థిక సాయం పొందడానికి PIA ప్రైవేటీకరణ కీలక షరతు అని తెలుస్తోంది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2020లో పైలట్ల లైసెన్సుల స్కామ్ బయటపడింది. దాదాపు 30 శాతం పైలట్ల లైసెన్సులు నకిలీవని తేలడంతో 262 మంది పైలట్లను గ్రౌండ్ చేశారు. యూరోపియన్ యూనియన్‌తో పాటు బ్రిటన్, అమెరికా... PIA విమానాలపై నిషేధం విధించాయి. అంతర్జాతీయ రూట్లు దాదాపు మూసివేశారు.
కాగా, 2020 మేలో PIA ఫ్లైట్ 8303 కరాచీలో కూలి 97 మంది మరణించిన విషయం తెలిసిందే. అవసరాలకు మించి ఉద్యోగుల నియామకం, అవినీతి, పేలవమైన నిర్వహణ (Poor Maintenance) కారణంగా PIAకు రూ. 200 బిలియన్ల నష్టాలు వచ్చాయి. తాజాగా IMF షరతు మేరకు PIA సంస్థలోని 51 శాతం నుంచి 100 శాతం వాటాలను అమ్మనున్నారు. ఇందుకు సంబంధించి డిసెంబర్ 23 న బిడ్డింగ్ జరగనుంది. ఇప్పటికే బిడ్డింగ్‌కు నాలుగు సంస్థలు అర్హత పొందాయి. అందులో పాకిస్తాన్ సైన్యానికి సంబంధించిన ఫౌజీ ఫర్టిలైజర్ కంపెనీ కూడా ఉండటం గమనార్హం.






