- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pakisthan: పాక్‌పై భారత్ దాడి చేస్తే ఏ దేశమూ మిగలదు.. రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్
భారత్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Kawaj asif) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌పై భారత్ దాడి చేస్తే ఏ దేశమూ మిగలదని హెచ్చరించారు. తమ దేశ భద్రతను ప్రమాదంలో పడేసే ఏ ప్రయత్నాన్నైనా సహించబోమని, తీవ్రంగా ప్రతిస్పందిస్తామని తెలిపారు. మంగళవారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. ఇండియా పాకిస్తాన్‌పై దాడి చేయడానికి ధైర్యం చేస్తే, ఎవరూ మనుగడ సాగించలేరని చెప్పారు. ‘మేము లేకపోతే, ఎవరూ ఉండరు. మా భద్రతకు ముప్పు వాటిల్లితే, దూకుడుగా పోరాడతాం’ అని వ్యాఖ్యానించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పాక్ సిద్ధంగా ఉందన్నారు.
పాకిస్థాన్ లో ఉగ్రవాదాన్ని భారత్ స్పాన్సర్ చేస్తోందని ఆరోపించారు. తమ సరిహద్దులకు ఇరు వైపులా శత్రువులే ఉన్నారన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi), ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin nethanyaahu) లపై ఆసిఫ్ విమర్శలు గుప్పించారు. ఇద్దరు నేతలు అహం, ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రమాదకరమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నెతన్యాహు అడుగుజాడల్లో నడుస్తూ మోడీ నిర్లక్ష్యంగా అడుగు వేస్తే, చరిత్ర గుర్తుంచుకునేలా ప్రతిస్పందన ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని దురాక్రమణ చర్యగా అభివర్ణించారు. నీటి సరఫరాను అడ్డుకునేందుకు నిర్మించే ఎటువంటి కట్టడాన్నైనా ధ్వంసం చేస్తామన్నారు.






