- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కశ్మీర్ పేదలను పాకిస్తాన్ టార్గెట్ చేసింది.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
కశ్మీర్ (Kashmir) పేదలను పాకిస్తాన్ (Pakistan) టార్గెట్ చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కశ్మీర్ (Kashmir) పేదలను పాకిస్తాన్ (Pakistan) టార్గెట్ చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ ఆయన పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కౌరి-బక్కల్ మధ్య నిర్మించిన చీనాబ్ రైల్వే బ్రిడ్జి (Chenab Railway Bridge)ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అదేవిధంగా కట్రాలో రూ.46 వేల కోట్లతో విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం కట్రాలో నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించుకున్నామని.. ఈరోజు చారిత్రాత్మక రోజు అని అన్నారు. ఇక కశ్మీర్ కూడా భారత్ రైల్వే నెట్‌వర్క్‌లో చేరిందని తెలిపారు. మాతా వైష్ణోదేవి (Mother Vaishno Devi) ఆశీర్వాదం వల్లే ఇదంతా సాధ్యం అయిందని అన్నారు. చీనాబ్ వంతెన అత్యద్భుతంగా నిర్మించామని తెలిపారు. రూ.46 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించామని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని.. కశ్మీర్ (Kashmir) నుంచి కన్యాకుమారి (Kanyakumari)కి కనెక్టివిటీ ఎట్టకేలకు లభించిందని అన్నారు. చీనాబ్ బ్రిడ్జి టూరిస్టులకు ఫెవరెట్ స్పాట్ౠగా మారబోతోందని ప్రధాని పేర్కొన్నారు.
ఎవరు ఏం చేసినా.. కశ్మీర్ అభివృద్ధిని ఆపలేరు
11 ఏళ్ల తమ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కల్పించామని తెలిపారు. దేశ వ్యాప్తంగా 11 కోట్ల మందికి సొంత ఇంటిని నిర్మించి ఇచ్చామని అన్నారు. పొరుగు దేశం పాకిస్తాన్ (Pakistan) టూరిజానికి వ్యతిరేకమని ఆరోపించారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ పహల్గాం (Pahelgam) ఉగ్రదాడే నిదర్శనమని అన్నారు. ఆ దాడి మానవత్వానికి ఓ మాయని మచ్చ అని అభివర్ణించారు. కశ్మీర్ పేదలను పాకిస్తాన్ టార్గెట్ చేసిందని కామెంట్ చేశారు. పహల్గాం టెర్రర్ అటాక్‌లో ఆదిల్ ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడాడని గుర్తు చేశారు. ప్రశాంతంగా ఉన్న మన దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ఉగ్రదాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. అందుకు పాక్ ఉగ్రవాదులకు ఇండియన్ ఆర్మీ (Indian Army) మే 6న ధీటైన సమాధానం ఇచ్చి గుణపాఠం చెప్పిందన్నారు. ఏకంగా పాక్ భూభాగంలోకి 100 కి.మీ దూసుకెళ్లి దాడులు చేశామని అన్నారు. ఎవరు ఏం చేసినా కశ్మీర్ అభివృద్ధిని ఆపలేరని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.






