Pakistan: యుద్ధం మొదలైతే నాలుగు రోజుల్లోనే పాక్ పని ఖతం..

by Shamantha N |

పాక్- భారత్‌ మధ్య ఉద్రిక్తతల వేళ యుద్ధం జరగవచ్చని ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే పాక్ మాత్రం కష్టాల్లో పడనుంది.

Pakistan: యుద్ధం మొదలైతే నాలుగు రోజుల్లోనే పాక్ పని ఖతం..
X

దిశ, నేషనల్ బ్యూరో: పాక్- భారత్‌ మధ్య ఉద్రిక్తతల వేళ యుద్ధం జరగవచ్చని ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే పాక్ మాత్రం కష్టాల్లో పడనుంది. యుద్ధం మొదలైతే పాకిస్థాన్‌ వద్ద ఉన్న ఫిరంగులు కేవలం నాలుగు రోజుల్లోనే ఖాళీ అయిపోతాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం పాక్ వద్ద అతి తక్కువ స్థాయిలో వీటి నిల్వలు ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు, సైనిక ఘర్షణల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫిరంగి గుండ్లకు డిమాండ్‌ పెరగడంతో.. పాక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు వీటిని ఉత్పత్తి చేయడానికి నానా అవస్థలు పడుతున్నాయి. ఇటీవలి కాలంలో పాక్‌ యుద్ధ వనరులు చాలా వరకు ఉక్రెయిన్‌కు విక్రయించడంతో.. దాయాది వద్ద నిల్వలు పడిపోయాయి. ప్రస్తుతం ఉన్నవి కేవలం 96 గంటలకు సరిపోతాయని ఓ నివేదిక వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్‌పై పాక్‌ అనుసరిస్తున్న మోహరింపుల వ్యూహం విజయవంతం కావాలంటే శతఘ్నుల పాత్ర ముఖ్యం. కాగా.. ఎం109 హోవిట్జర్లకు 155 ఎంఎం గుండ్లు, బీఎం 21 సిస్టమ్స్‌కు 122 ఎంఎం రాకెట్లు ఆ దేశ సైన్యం రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తాయి. వీటిల్లో 155 ఎంఎం గుండ్లను ఉక్రెయిన్‌కు ఎగుమతి చేసింది. భారత్‌ ఎదురుదాడి వ్యూహాన్ని అమలు చేస్తే మాత్రం పాక్‌ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా శతఘ్నులు, సెల్ఫ్‌ప్రొపెల్డ్‌ గన్స్‌, ఎంజీఎస్‌ వ్యవస్థల పనితీరు గణనీయంగా పడిపోనుంది.

పాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు..

మరోవైపు, పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు (POF), మౌలిక సదుపాయాలు, పరిమిత ఉత్పత్తి సామర్థ్యం కారణంగా తిరిగి నింపే డిమాండ్లను కొనసాగించలేకపోయాయి. దేశీయ అవసరాలను తీర్చడానికి పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ప్రాధాన్యతనిచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో అది అలా చేయడంలో కష్టంగా మారింది. మరోవైపు ఈ విషయంపై పాక్‌ సైనిక నాయకత్వం తీవ్ర ఆందోళన చెందుతోంది. మే2న జరిగిన ఆ దేశ కోర్‌ కమాండర్ల సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక గతంలో పాక్‌ మాజీ ఆర్మీచీఫ్‌ ఖమర్‌ జావెద్‌ భజ్వా కూడా ఆర్థిక బలహీనత ప్రభావం సైనిక దళాల మందుగుండుపై పడుతున్నట్లు పేర్కొన్నారు. పాక్‌ తన మందుగుండు నిల్వల కేంద్రాన్ని అత్యవసర స్థితిలో వేగంగా వాడుకునేందుకు భారత్‌ సరిహద్దుల్లోనే ఏర్పాటు చేసింది.

Next Story