- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Drone Attack: భారత్ మాపై డ్రోన్ దాడి చేసింది : పాక్ ప్రకటన
భారత్ తమపై డ్రోన్ దాడికి పాల్పడినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. తమదేశంలోని 5 నగరాలపై డ్రోన్లతో దాడి చేసిందని, కరాచీ, లాహోర్లో జరిగిన డ్రోన్ అటాక్ భారత్ పనేనని వెల్లడించింది.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ తమపై డ్రోన్ దాడికి (Drone Attack) పాల్పడినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. తమదేశంలోని 5 నగరాలపై డ్రోన్లతో దాడి చేసిందని, కరాచీ (Karachi), లాహోర్(Lahore)లో జరిగిన డ్రోన్ అటాక్ భారత్ పనేనని వెల్లడించింది. 5 నగరాల్లోనూ హరోప్ రకానికి చెందిన 12 డ్రోన్లను వినియోగించిందని, వాటన్నింటినీ కూల్చివేశామని పాక్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే పాక్ ప్రకటనను భారత్ ఖండించింది. పాక్ చెబుతున్నదంతా అబద్ధమని, పాత వీడియోలు, ఫొటోలను చూపించి దుష్ర్పచారం చేస్తోందని, PIB ఫ్యాక్ట్ చెక్ లో భారత్ ఆధారాలతో సహా బయటపెట్టింది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న 9 ఉగ్రస్థావరాలపై దాడి చేసి.. 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. వీరిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ (Masood) కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈ దాడి తర్వాత మసూద్.. ఇక భారత్ పై ఏమాత్రం జాలి చూపించనని, ప్రధాని మోడీని చంపేస్తానని విడుదల చేసిన లేఖ సంచలనం సృష్టించింది. ఆపరేషన్ సిందూర్ జరిగిన మరుసటి రోజే లాహోర్, కరాచీ, రావల్పిండి, నసీరాబాద్ వంటి 12 ప్రాంతాల్లో డ్రోన్లు పేలడంతో ఆ ప్రాంతాలన్నీ పెద్ద శబ్దాలతో దద్దరిల్లాయి.






