పాక్ పరువు పోయే.. 5000 మందికి పైగా బహిష్కరణ

by Naga Rani Yarlagadda |

సౌదీ అరేబియాతో పాటు ఇతర ముస్లిం దేశాల నుంచి 5,000 మందికి పైగా పాకిస్థానీ బిచ్చగాళ్లను తిరిగి స్వదేశానికి పంపిన ఘటన పాకిస్థాన్‌కు అంతర్జాతీయంగా అవమానం తెచ్చిపెట్టింది. పాకిస్థాన్ హోంశాఖ మొహ్‌సిన్ నఖ్వీ ఈ విషయాన్ని తమ దేశ పార్లమెంట్‌లో వెల్లడించారు.

పాక్ పరువు పోయే.. 5000 మందికి పైగా బహిష్కరణ
X

దిశ, వెబ్‌డెస్క్: సౌదీ అరేబియాతో పాటు ఇతర ముస్లిం దేశాల నుంచి 5,000 మందికి పైగా పాకిస్థానీ బిచ్చగాళ్లను తిరిగి స్వదేశానికి పంపిన ఘటన పాకిస్థాన్‌కు అంతర్జాతీయంగా అవమానం తెచ్చిపెట్టింది. పాకిస్థాన్ హోంశాఖ మొహ్‌సిన్ నఖ్వీ ఈ విషయాన్ని తమ దేశ పార్లమెంట్‌లో వెల్లడించారు. సౌదీ అరేబియా, ఇరాక్, మలేసియా, ఒమన్, ఖతర్, యూఏఈ వంటి దేశాల నుంచి మొత్తం 5,402 మంది బిచ్చగాళ్లను డిపోర్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సంఖ్యలో సౌదీ అరేబియా ఒక్కటే గత ఏడాది జనవరి నుంచి 5,033 మందిని తిరిగి పంపింది. ఈ బిచ్చగాళ్లలో ఎక్కువ శాతం సింధ్ ప్రాంతానికి చెందినవారేనని మంత్రి వివరించారు.

ఈ డిపోర్టేషన్ల వెనుక ఉన్న కారణం.. పాకిస్థానీ పౌరులు ఉమ్రా యాత్రలు, ఇతర వీసాల పేరుతో ఈ దేశాలకు వెళ్లి అక్కడ బిచ్చమెత్తడమేనని ఆయన చెప్పారు. దీంతో సౌదీ అరేబియా పాకిస్థాన్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఈ బిచ్చగాళ్ల రాకను అదుపు చేయకపోతే భవిష్యత్తులో పాకిస్థానీ యాత్రికులకు వీసా ఆంక్షలు విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ పరిస్థితి పాకిస్థాన్‌కు ప్రపంచ వేదికపై ఇబ్బందికరంగా మారింది. దీనిని అంతర్జాతీయ మీడియా, సోషల్ మీడియాలో "అంతర్జాతీయ బిచ్చగాడు" అని వ్యంగ్యంగా పేర్కొంటున్నారు.

Next Story