- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. సరిహద్దుల్లో డిఫెన్స్ భద్రత పెంచిన పాక్!
ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్‌తో సరిహద్దుల్లో డిఫెన్స్ భద్రతను పాక్ భారీగా పెంచింది. యాంటీ డ్రోన్ వ్యవస్థలు డిప్లాయ్ చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ తమ సరిహద్దు వద్ద యాంటీ-డ్రోన్ వ్యవస్థలను డిప్లాయ్ చేస్తోంది. ఆపరేషన్ సిందూర్‌లో భారత దాడులను ఏమాత్రం కట్టడి చేయలేకపోయిన పాక్.. ఇటీవలి కాలంలో ఆర్మీ అధికారులు ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ అంటూ వ్యాఖ్యలు చేయడంతో టెన్షన్‌లో పడినట్లు కనిపిస్తోంది. అందుకే సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేసేందుకు పీవోకేలోని ఫార్వర్డ్ ఏరియాలు, ఎల్ఓసీ వెంట కౌంటర్ అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ (సీ-యూఏఎస్)ను ఏర్పాటు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం 30 సీ-యూఏఎస్ వ్యవస్థలను పాక్ ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వాయుసేన చాలా ప్రెసిషన్‌తో దాడులు చేయడంతో.. గగనతల భద్రతను పెంచకపోతే భవిష్యత్తులో మరింత డేంజర్ అనే ఆందోళనతోనే పాక్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. రావాలకోట్, కోట్లీ, భింబేర్ సెక్టార్లలో ఈ సీ-యూఏఎస్‌లను పాక్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పాక్ డిప్లాయ్ చేసిన వాటిలో స్పైడర్ సీ-యూఏఎస్ వ్యవస్థలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇవి 10 కిలోమీటర్ల పరిధిలో పాసివ్ రేడియో ఫ్రీక్వెన్సీలను డిటెక్ట్ చేయగలవని, ఆ సిగ్నల్స్ ఏ దిశ నుంచి వస్తున్నాయో కూడా గుర్తించగలవని నిపుణులు చెప్తున్నారు.
సఫ్రా యాంటీ-యూఏవీ జామింగ్ గన్ కూడా డిప్లాయ్ చేసిందట పాక్. ఇది డ్రోన్ కంట్రోల్, వీడియో, జీపీఎస్ అనుసంధానాన్ని దెబ్బతీయగలదు. వీటికితోడు డ్రోన్లను నాశనం చేయగలిగే ఓర్లికాన్ జీడీఎఫ్ 35 ఎంఎం ట్విన్ బ్యారెల్ యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్, రాడార్ గైడెన్స్ వ్యవస్థలు, అంజా ఎంకే-2, ఎంకే-3 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా పాక్ డిప్లాయ్ చేసిందట. ఇవి స్లో, లో ఆల్టిట్యూడ్ ఏరియల్ టార్గెట్స్‌ను ఎటాక్ చేయగలవని నిపుణులు తెలిపారు.






