ఇజ్రాయెల్ ప్రధానిని అమెరికా అరెస్ట్ చేయాలి : పాక్ రక్షణ మంత్రి ఖవాజా

by Muthe.Rajitha |

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇజ్రాయెల్ ప్రధానిని అమెరికా అరెస్ట్ చేయాలి : పాక్ రక్షణ మంత్రి ఖవాజా
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ చేసిన చర్యలను తీవ్రంగా విమర్శించిన ఆయన.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును "అతి పెద్ద నేరస్థుడు"గా అభివర్ణించారు. గాజాలో పాలస్తీనియన్లపై జరిగిన దారుణాలు చరిత్రలో ఎప్పుడూ లేవని అన్నారు. అమెరికా నిజంగా మానవ హక్కులను పట్టించుకుంటే.. ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఎలా అరెస్టు చేసి న్యూయార్క్‌కు తీసుకువచ్చిందో, అదే విధంగా నెతన్యాహును కూడా “కిడ్నాప్” చేసి అమెరికా కోర్టులో విచారణ చేయాలని అసిఫ్ వ్యాఖ్యానించారు. టర్కీ కూడా నెతన్యాహు మీద చర్యలు తీసుకోవాలని కోరింది.

ఈ సందర్భంగా 2024లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ICC) జారీ చేసిన అరెస్ట్ వారంట్‌లను ఆయన పదేపదే ప్రస్తావించారు. అయితే ఈ వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ ప్రభుత్వం స్పందిస్తూ, ఇవి ఖవాజా అసిఫ్ వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని, ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేసింది. పాకిస్తాన్‌కు ఇజ్రాయెల్‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేవని, పాలస్తీన్‌కు తాము మద్దతు ఇస్తామని కూడా వెల్లడించింది.

Next Story