భారత్ ఎటాక్ కన్ఫర్మ్.. సొంత ఆర్మీ అబద్ధాలు ఎండగట్టిన పాక్

by Phanindra |   (  Updated:2025-05-12 16:22:05  IST  )

పాక్ ఎయిర్‌ బేస్‌లపై భారత్ చేసిన దాడులను ఆ దేశ అధికారులు కన్ఫర్మ్ చేశారు. దీంతో ఆ దేశపు ఆర్మీ చెప్పిన అబద్ధాలు బట్టబయలయ్యాయి.

భారత్ ఎటాక్ కన్ఫర్మ్.. సొంత ఆర్మీ అబద్ధాలు ఎండగట్టిన పాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా పాకిస్తాన్‌ రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్‌ను టార్గెట్ చేసినట్లు భారత వాయుసేన చేసిన ప్రకటనను పాక్ ధ్రువీకరించింది. రహీం యార్ ఖాన్‌‌లోని షేక్ జాయెద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై (ఎయిర్ బేస్) భారత్ చేసిన దాడుల్లో ఏడుగురు చనిపోయారని, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని పాక్ అధికారులు తెలిపారు. అలాగే ఈ దాడుల్లో లాహోర్‌‌కు 400 కిలోమీటర్ల దూరంలోని ఈ ఎయిర్‌బేస్‌కు చాలా నష్టంవాటిల్లిందని చెప్పారు.

‘భారత దాడులతో ఇక్కడ చాలా నష్టం జరిగింది. ఎయిర్ బేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగా దెబ్బతింది. యూఎఈ ప్రెసిడెంట్, వారి కుటుంబం ఉపయోగించి రాయల్ లాంజ్‌‌ కూడా దెబ్బతింది’ అని అధికారులు చెప్తున్నారు. అదే సమయంలో ఈ ఎయిర్‌ బేస్‌పై మిసైల్స్, డ్రోన్లతో భారత్ దాడులు చేసిందని రహీం యార్ ఖాన్ డిప్యూటీ కమిషనర్ ఖుర్రం జావేద్ వెల్లడించారు.

అయితే ఆదివారం నాడు పాక్ డీజీఐఎస్‌పీఆర్ అహ్మద్ షరీఫ్ చౌదరీ మాట్లాడుతూ భారత్ చేసిన దాడులన్నీ తిప్పికొట్టామని, ఎక్కడా ఎలాంటి నష్టం జరగలేదని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పాక్ అధికారులు చేసిన ప్రకటన అహ్మద్ షరీఫ్ చౌదరీ చెప్పిన మాటలకు విరుద్ధంగా ఉండటంతో పాకిస్తానీలు అవాక్కవుతున్నారు.

Next Story