- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ballistic Missile: బాలిస్టిక్ మిస్సైల్ ని పరీక్షించిన పాకిస్థాన్
పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కాగా.. ఇలాంటి తరుణంలో పాక్ బాలిస్టిక్ మిస్సైల్ ని పరీక్షంచింది.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కాగా.. ఇలాంటి తరుణంలో పాక్ బాలిస్టిక్ మిస్సైల్ ని పరీక్షంచింది. సర్ఫేస్ టు సర్ఫేస్ పైకి 450 కి.మీ. రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ని ప్రయోగించింది. అబ్దాలి వెపన్ సిస్టమ్ క్షిపణిని (surface-to-surface missile test) విజయవంతంగా ప్రయోగించినట్లు ఇస్లామాబాద్ పేర్కొంది. ‘ఇండస్’ కసరత్తుల్లో భాగంగా దానిని ప్రయోగించినట్లు వెల్లడించింది. సాయుధ దళాల కార్యాచరణ, సంసిద్ధతను నిర్ధారించడం.. క్షిపణుల అధునాతన నావిగేషన్ వ్యవస్థ సహా కీలకమైన సాంకేతిక పరిమితులను ధ్రువీకరించడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలిపింది. దేశ జాతీయ భద్రతను కాపాడటానికి దళాల కార్యాచరణ సంసిద్ధత, సాంకేతిక నైపుణ్యంపై ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సహా సాయుధదళాల అధిపతులు పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారని పేర్కొంది.
గతంలోనూ ఇలాంటి ప్రకటనలే..
ఏప్రిల్ 24, 25 తేదీల్లో కరాచీ తీరం వెంబడి ఎకనామిక్ ఎక్స్‌క్లూజివ్ జోన్‌లో భూతలం నుంచి భూతలం పైకి క్షిపణి ప్రయోగాలు నిర్వహించేందుకు పాకిస్థాన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 26-27 మధ్య మరోసారి అలాంటి ప్రకటనే చేసింది. ఇప్పుడు ఏప్రిల్ 30- మే 2 మధ్య మరోసారి పరీక్షలు చేపడుతున్నట్లు ప్రకటించింది. అయితే పాక్ తరచూ ఇటువంటి ప్రకటనలు చేస్తూ.. భారత్‌ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందని భారత రక్షణశాఖ అధికారులు మండిపడ్డారు. భారతదేశం 36 గంటల్లో పాక్ పై దాడి చేస్తుందని పాక్ సమాచార మంత్రి అతుల్లా తారా అన్నారు. ఏప్రిల్ 22న మధ్యాహ్నం జమ్ముకశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతమైన పహెల్గాం (Pahalgam)లో ఉగ్రవాదులు అమాయకులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. దీంతో, భారతప్రభుత్వం పాక్ పై ప్రతీకార చర్యలకు దిగింది. వీసాలు రద్దు, సింధు జలాల ఒప్పందం నిలిపివేత, ఔషధాల ఎగుమతి, పాకిస్థాన్ నటుల సినిమాలు బ్యాన్ చేసింది.






